Sharmila sensational comments: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో వైఎస్సార్టీపీ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ ముగిసింది. తరువాత ఆమె బయటికొచ్చి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కు ఇక తెలంగాణలో కౌండ్ డౌన్ స్టార్ట్ అయిందన్నారు షర్మిల.
సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీతో కూడా భేటీ అయ్యాయని ఆమె స్పష్టం చేశారు. అయితే ఏది ఏమైనా ప్రజలకు మేలు జరగాలన్నదే తన అంతిమ లక్ష్యమన్నారు ఆమె. ఇక ఈ భేటీలో సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగిందన్నారు. ఆ చర్చ నిర్మాణాత్మకమైన చర్చ అని ఆమె వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసేలా పనిచేస్తానని షర్మిల మీడియా ముందుకు చెప్పుకొచ్చారు.
అయితే హైకమాండ్ తో షర్మిల భేటీ ఆమె పార్టీ విలీనానికి రూట్ క్లియర్ అయినట్టేనని ప్రచారం జరుగుతోంది. కొన్నాళ్ళ నుంచి ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా ఆమె గతంలో పాలేరు నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆమె పాలేరు టికెట్ అడుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక తనతో పాటు తన పార్టీలోని కొందరికి కూడా టికెట్ ఆమె ఖాయం చేసుకునే పనిలో ఉన్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక ఈ భేటీ తరువాత వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనానికి సంబంధించి అధికార ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.
ఇది కూడా చదవండి..సోనియా గాంధీని కలిసిన వైఎస్ షర్మిల..విలీనం ఖరారే!!