y s Sharmila:షర్మిలకు దారి దొరికినట్టేనా..విలీనానికి రూట్ క్లియరా!

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల దారెటు..? కాంగ్రెస్ వైపేనా..! కన్ఫామ్ అయినట్టేనా..! ఢిల్లీ టూర్లో కాంగ్రెస్ హైకమాండ్ ఆమెకు ఇచ్చిన హమీలేంటీ..? ఆమె తన పార్టీ క్యాడర్ కు ఇస్తున్న భరోసా ఏంటీ..? తెలంగాణ రాజకీయాలపై ఆమె ప్రభావమెంత ఉండబోతుంది..? ఏపీలోను షర్మిల కీ రోల్ ప్లే చేయబోతున్నారా..!!

y s Sharmila:షర్మిలకు దారి దొరికినట్టేనా..విలీనానికి రూట్ క్లియరా!
New Update

y s Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల దారెటు..? కాంగ్రెస్ వైపేనా..! కన్ఫామ్ అయినట్టేనా..! ఢిల్లీ టూర్లో కాంగ్రెస్ హైకమాండ్ ఆమెకు ఇచ్చిన హమీలేంటీ..? ఆమె తన పార్టీ క్యాడర్ కు ఇస్తున్న భరోసా ఏంటీ..? తెలంగాణ రాజకీయాలపై ఆమె ప్రభావమెంత ఉండబోతుంది..? ఏపీలోను షర్మిల కీ రోల్ ప్లే చేయబోతున్నారా..!!

పార్టీ విలీనానికి షర్మిల ప్రయత్నాలు..!

వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తన రాజకీయ భవిష్యత్తు కోసం రానున్న ఎన్నికల్లో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని చాలా కాలం నుంచి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటక ఫలితాలు వెలువడిన తరువాత ఆమె ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ ముందు పెట్టారు. ఈ క్రమంలోనే ఆమె కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతును తీసుకున్నారు. బెంగుళూరు వెళ్ళి ఆయనతో కలిసి పార్టీ విలీనానికి పావులు కదిపారు. అయితే షర్మిల పార్టీ విలీనానికి టీపీసీసీ అంగీకరించకపోవడంతో ఆ విషయం ముందుకు కదల్లేకపోయింది. ఇక డీకే శివకుమార్ ఇటు తెలంగాణ నేతలతో మాట్లాడి వారి ప్రతిపాదనను అదే విధంగా షర్మిల ప్రస్తావనను హైకమాండ్ ముందు పెట్టారు. దీంతో ఆమె నాలుగు రోజుల క్రితం నేరుగా ఢిల్లీకి వెళ్లి అక్కడ పెద్దలతో చర్చలు జరిపారు.

ఈ వారంలోనే విలీనం ఉంటుందని ప్రచారం..

అయితే ఈ నేపథ్యంలో ఈ వారంలోనే షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు దీనిపై షర్మిల తన పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. వేదిక ఏదైనా వైఎస్ఆర్ సంక్షేమ పాలనే తమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. తనను నమ్ముకున్న పార్టీ నాయకులు అధైర్య పడాల్సిన పనిలేదని.. అందరికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఆమె హమీ ఇచ్చారు. దీంతో పార్టీ విలీనానికి సంబంధించి షర్మిలకు క్లియరెన్స్ దక్కినట్లు తెలుస్తోంది.

కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిల..!

షర్మిల తెలంగాణ రాజకీయాల్లో సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కాని పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా మారుతున్నాయి. షర్మిల పార్టీని విలీనం చేస్తే తెలంగాణ కాంగ్రెస్ కు ప్రయోజనం పక్కన పెడితే..నష్టం అధికంగా ఉంటుందని టీపీసీసీ రేవంత్ రెడ్డి ముందు నుంచి పార్టీ పెద్దల ముందు వాయిస్ వినిపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు కాకుండా ఏపీ రాజకీయాల్లో షర్మిలను దింపితే బెటర్ అని కూడా సూచించడం జరిగింది. హైకమాండ్ కూడా అదే విధంగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. దీంతో ఆమె ఏపీ పాలిటిక్స్ లో కీ రోల్ ప్లే చేయబోనున్నారు. అదే సమయంలో ఆమె పాలేరు అసెంబ్లీ సీట్ ను డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.

అయితే కాంగ్రెస్ నాయకత్వం మాత్రం ఆమెకు కర్ణాటక నుంచి రాజ్యసభ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి షర్మిల కూడా అంగీకారం తెలిపారని సమాచారం. అదే విధంగా తన మద్దతుదారులకు కూడా అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని ఆమె ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. వీటిన్నింటి పై క్లారిటీ వచ్చిన తరువాత ఫైనల్ గా రాహుల్ గాంధీతో చర్చలు జరుగనున్నాయి. ఇక అంతా ఓకే అయితే.. సోనియా గాంధీ సమక్షంలో ఆమె పార్టీ కాంగ్రెస్ లో అధికారికంగా విలీనం కానుంది. మరి ఏపీలో కీలక బాధ్యతల నేపథ్యంలో.. అన్న జగన్ కు వ్యతిరేకంగా షర్మిల ఎలా పనిచేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

తెలంగాణపై షర్మిల ఎఫెక్ట్ ఏముండదు..!

ఇక తెలంగాణలో షర్మిల ప్రభావం లేదని ఆర్టీవీతో బీఆర్ఎస్ సీనియర్ నేత మంద జగన్నాథం అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎవరితోనూ పొత్తు అవసరం లేదని ఒంటరిగానే వెళ్తామన్నారు ఆయన.  తమ సీఎం అభ్యర్థి కేసీఆరే అని పేర్కొన్నారు. తెలంగాణపై షర్మిల ప్రభావం  లేదని చెప్పారు. షర్మిల రాకతో కాంగ్రెస్ కు ఒరిగేది ఏమీ లేదన్నారు. ఆమె కాంగ్రెస్ లో వెళ్లడం తమకే మంచిదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం ప్రభావం తెలంగాణపై ఉండబోదని మంద జగన్నాథం పేర్కొన్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి