కర్ణాటక రాజధాని బెంగళూరులో నేటి నుంచి రెండు రోజుల పాటు ఉమ్మడి ప్రతిపక్షాల సమావేశం ప్రారంభం కానుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ ఈరోజు ఈ సమావేశానికి హాజరుకావడం లేదు . అయితే రేపు జరిగే సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. అంతకుముందు జూన్ 23న పాట్నాలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశానికి కూడా పవార్ హాజరయ్యారు. రేపు జరిగే సమావేశానికి శరద్ పవార్ , ఆయన కూతురు, లోక్‌సభ ఎంపీ సుప్రియా సూలే హాజరుకానున్నారు. ఈ మేరకు పవార్ వర్గం అధికార ప్రతినిధి తెలిపారు.
పూర్తిగా చదవండి..విపక్షాల భేటీకి శరద్ పవార్ దూరం?..కారణం ఇదేనా..!!
బెంగళూరులో నేటి నుంచి ప్రారంభమయ్యే రెండు రోజుల ప్రతిపక్షాల సమావేశానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ హాజరుకావడం లేదు. అయితే రేపు జరిగే సమావేశానికి ఆయన, ఆయన కుమార్తె సుప్రియా సూలే హాజరయ్యే అవకాశం ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు ఐక్య ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో నిమగ్నమైన అగ్రనేతల్లో పవార్ ఒకరు.

Translate this News: