Jaswanth: షణ్ముక్‌ గంజాయి కేసుపై లాయర్ దిలీప్ సుంకర షాకింగ్ పోస్ట్

షణ్ముక్‌ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రముఖ లాయర్ దిలీప్ సుంకర షణ్ముక్‌కు మద్దతుగా నిలిచారు. మీడియాలో వస్తున్న వార్తలకు షణ్ముక్ కు సంబంధం లేదన్నారు. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలున్నాయని తెలిపారు.

Jaswanth: షణ్ముక్‌ గంజాయి కేసుపై లాయర్ దిలీప్ సుంకర షాకింగ్ పోస్ట్
New Update

Shanmukh Jaswanth Ganja Case Updates: డ్రగ్స్‌ కేసులో ప్రముఖ యూట్యూబర్ షణ్ముక్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ పోలీసులకు గంజాయితో పట్టుబడ్డాడు. తనను మోసం చేశాడంటూ షణ్ముఖ్ సోదరుడు సంపత్ పై ఒక యువతి ఫిర్యాదు చేసింది. ఆ కేసులో విచారణ కోసం వెళ్లిన పోలీసులకు సంపత్ ఫ్లాట్ లో గంజాయితో పాటు షణ్ముఖ్ బుక్కయ్యాడు. దీంతో షణ్ముఖ్, సంపత్ ఇద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు.

యూట్యూబ్‌లో అవకాశాలు ఇస్తానని చెప్పి.. షణ్ముక్‌ మోసం చేశాడని పోలీసులకు డాక్టర్ మౌనిక (Dr Monica) ఫిర్యాదు చేసింది. షణ్ముక్‌ ద్వారానే అతని అన్న సంపత్‌ (Sampath Vinay) పరిచయమయ్యాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. షణ్ముక్‌ అన్న సంపత్ వినయ్ హోటల్స్, విల్లాలకు తీసుకెళ్లి తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని తెలిపింది. ఓసారి తనకు అబార్షన్ కూడా చేయించాడని పేర్కొంది. 

Also Read: సమంత వర్క్ ఔట్స్.. ఆ సినిమా కోసమే.. వైరలవుతున్న పోస్ట్

అయితే, తాజాగా ఈ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రముఖ లాయర్ దిలీప్ సుంకర ఈ సీన్ లోకి ఎంటర్ అయ్యారు. షణ్ముక్‌కు మద్దతుగా నిలిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. షణ్ముక్‌పై మీడియాలో వస్తున్న వార్తలకు సంబంధం లేదని అన్నారు. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలున్నాయని తెలిపారు. షణ్ముక్‌కు మద్దతుగా నిలుస్తూ దిలీప్‌ సుంకర చేసిన పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

షణ్ముక్‌, అతని అన్న సంపత్ వినయ్ కేసు..తాను చూస్తున్నట్లు దిలీప్ సుంకర తెలిపారు. షణ్ముక్ తండ్రి తనతోనే ఉన్నాడని చెప్పుకొచ్చారు. షణ్ముక్‌ని కలిసేందుకు నార్సింగి పీఎస్‌కు దిలీప్ సుంకర వెళ్లినట్లు తెలుస్తోంది. షణ్ముక్‌తో తనకు నాలుగేళ్ల పరిచయం ఉన్నట్లు దిలీప్ సుంకర వెల్లడించారు. షణ్ముక్‌ ఉంటున్న ఫ్లాట్ ఓనర్‌కు తాను..లీగల్ సెల్ అడ్వైసర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. అపార్ట్‌మెంట్ వీడియోస్ మొత్తం తన దగ్గరున్నాయని వ్యాఖ్యానించారు.

#shanmukh-jaswanth-ganja-case
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe