Ananthapuram: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ నాలుగు పార్టీలు ముంచేశాయని.. సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 26న అనంతపురం వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నామని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జూనియర్ కళాశాల మైదానంలో పరిశీలించారు. ఏఐసీసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున కర్గే, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఈ కార్యక్రమానికి హాజరవుతారన్నారు.
Also Read: మేడారం జాతర నిర్వహణ నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
ప్రతి కుటుంబానికీ ఏ విధంగా న్యాయం చేస్తామన్నది ఈ సభ ద్వారా చెప్తామని రఘువీరా అన్నారు. టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేలు ఈ రాష్ట్రాన్ని ముంచేశాయని..దుష్ట చతుస్టయం ఈ నలుగురేనని కామెంట్ చేశారు. ఏపీకి రాజధాని, పోలవరం, విశాఖ ఉక్కు కోసం భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్పారు. సీఎం జగన్ సిద్దం సభకు డబ్బులు, బిర్యానీ ఇచ్చి జనాన్ని తోరలించారని విమర్శలు గుప్పించారు. అది ప్రభుత్వ సభానా లేక పార్టీ సభనో అర్థం కావడం లేదన్నారు. ఈ సభలో జర్నలిస్టుల మీద దాడిని రఘువీరా తీవ్రంగా ఖండించారు.
Also Read: బాబాయ్ పవన్ కళ్యాణ్ కోరితే కచ్చితంగా ప్రచారానికైనా వస్తాను: హీరో వరుణ్ తేజ్