సంచలనం సృష్టించిన శంషాబాద్ మహిళ హత్య కేసు మిస్టరీని 24 గంటల్లోనే పోలీసులు చేధించారు. మృతురాలను రాళ్ళగూడదొడ్డి ప్రాంతానికి చెందిన వడ్ల మంజులగా గుర్తించారు. మంజులను హత్యచేసిన రిజ్వాన బేగంతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక లావాదేవీల విషయంలోనే ఈ హత్య జరిగినట్లు శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. మంజుల కొన్నాళ్ల క్రితం రిజ్వాన అనే మహిళకు రూ.లక్ష అప్పుగా ఇచ్చిందని.. రెండు నెలలుగా వడ్డీ చెల్లించడం లేదన్నారు. దీంతో ఈ నెల 10న రిజ్వాన ఇంటికి వెళ్లిన మంజుల, ఆమె భర్త డబ్బులు తిరిగి ఇవ్వాలని గట్టిగా నిలదీయడంతో నిందితురాలు రిజ్వాన వారిపై కక్ష పెంచుకుందని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..శంషాబాద్ హత్య కేసులో వీడిన మిస్టరీ.. రూ.లక్ష కోసం హత్య
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన శంషాబాద్ మహిళ హత్య కేసులో మిస్టరీ వీడింది. ఆమెను హత్యచేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంజుల హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు నిర్ధారించారు.
Translate this News: