India vs Sri Lanka: షమీ, సిరాజ్ వీర విహారం.. శ్రీలంకకు పట్టపగలే చుక్కలు..!

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు వీర విహారం చేస్తున్నారు. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌కు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. షమీ 5 వికెట్లు, సిరాజ్ 3 వికెట్లు పడగొట్టారు.

New Update
India vs Sri Lanka: షమీ, సిరాజ్ వీర విహారం.. శ్రీలంకకు పట్టపగలే చుక్కలు..!

India vs Sri Lanka: ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు వీర విహారం చేస్తున్నారు. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌కు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. బుమ్రా తొలి బంతికె వికెట్ తీసి శ్రీలంకను హడలెత్తిస్తే.. మరో పేసర్ సిరాజ్ సైతం తానేం తక్కువా అంటూ తుక్కు రేగ్గొట్టాడు. సెకండ్ ఓవర్‌లో ఒక్క పరుగు ఇవ్వకుండానే రెండు వికెట్లు డౌన్ చేశాడు. ఇలా రెండు మేడిన్‌లు చేసి మొత్తం 3 వికెట్లు పడగొట్టాడు. ఇక స్పిన్నర్ షమీ తానేం తక్కువ అంటూ చెలరేగిపోయాడు. ఏకంగా 5 వికెట్లు పడగొట్టి దుమ్మురేపాడు. ఇలా బౌలర్ల దెబ్బకు శ్రీలంక బ్యాట్స్‌మెన్ కకావిలకం అయిపోయారు. జస్ట్ 14 ఓవర్లకే 8 వికెట్లు సమర్పించుకుని చేతులెత్తేశారు.

భారత్-శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్, మహ్మద్ షమీ హ్యాట్రిక్ వికెట్లు సాధించారు. ఇక వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ల జాబితాలో 44 వికెట్లతో మహ్మద్ షమీ 3వ స్థానంలో నిలిచాడు. 33 వికెట్లతో జస్పీత్ బూమ్రా 4వ స్థానంలో నిలిచాడు.

Also Read:

కేసీఆర్ అంటే కాళేశ్వరం కరెప్షన్ రావు.. కేంద్ర సహకారంతోనే ఐటీ దాడులు: రేవంత్ రెడ్డి సంచలన వాఖ్యలు

 హీటెక్కుతున్న రాజకీయాలు.. తెలంగాణకు రానున్న ప్రధాని

Advertisment
తాజా కథనాలు