Shahrukh Khan : దాదాసాహెబ్‌ ఫాల్కే ఉత్తమ నటుడి గా షారుక్‌ ఖాన్‌!

జవాన్‌ సినిమాకు బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ ఉత్తమ నటుడిగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఇదే సినిమాకు లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. విక్కీ కౌశల్‌ క్రిటిక్స్ తరుఫున ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.

Shahrukh Khan : దాదాసాహెబ్‌ ఫాల్కే ఉత్తమ నటుడి గా షారుక్‌ ఖాన్‌!
New Update

Shahrukh Khan : దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఒకటైన దాదాసాహెబ్ ఫాల్కే(Dadasaheb Phalke Awards) అంతర్జాతీయ అవార్డు 2024 వేడుకను మంగళవారం సాయంత్రం ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో షారూఖ్ ఖాన్(Shahrukh Khan) , బాబీ డియోల్, నయనతార, కరీనా కపూర్ ఖాన్, సునీల్ గ్రోవర్, ఆదిత్య రాయ్ కపూర్, అనిల్ కపూర్, షాహిద్ కపూర్, విక్రాంత్ మాస్సే, అట్లీ, రాణి ముఖర్జీ వంటి బాలీవుడ్‌ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ వేడుకలో జవాన్‌(Jawan) సినిమాకు గానూ బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. ఇదే సినిమాకు లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార(Nayanthara) ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. చాలా కాలం తరువాత బాలీవుడ్ రికార్డులను జవాన్ సినిమా తిరగరాసింది. దీని కంటే ముందు షారుక్‌ నటించిన పఠాన్ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. జవాన్‌ చిత్రం దేశ వ్యాప్తంగా రూ. 604 కోట్లకు పైగా వసూళు రాబట్టింది. ఈ అవార్డును అందుకోవడం పట్ల షారుక్‌ సంతోషాన్ని వ్యక్తం చేశాడు

ప్రపంచ వ్యాప్తంగా 900 కోట్లు దాటేసింది. ఇదిలా ఉంటే ''సామ్ బహుదూర్‌'' చిత్రానికి గానూ నటుడు విక్కీ కౌశల్‌ ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డు గెలుచుకోవడం పట్ల విక్కీ సోషల్ మీడియా వీడియో ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇందులో - 'సామ్ బహదూర్‌లో ఉత్తమ నటుడు క్రిటిక్స్ అవార్డును అందించినందుకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు జ్యూరీకి చాలా ధన్యవాదాలు అంటూ పేర్కొన్నాడు. కొన్ని కారణాల వల్ల అవార్డ్ షోకు హాజరు కాలేకపోయిన కారణంగా విక్కీ ఈ వీడియో అవార్డ్ ఫంక్షన్‌లో ప్రదర్శించారు.

‘యానిమల్‌’ చిత్రానికి గానూ నెగిటివ్‌ రోల్‌లో ఉత్తమ నటుడిగా బాబీ డియోల్‌ అవార్డు అందుకున్నారు. ఇది కాకుండా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా 'యానిమల్' చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడు అవార్డును అందుకున్నారు.

Also Read : కొడుకును సరిగా పెంచి ఉంటే బాగుండేదని… సోనియాకి స్మృతి ఇరానీ ఉచిత సలహా..!

#nayanthara #shahrukh-khan #international-award #dadasaheb-phalke-awards
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe