Tamilanadu Accident: తమిళనాడులో ఘోర ప్రమాదం..ఏడుగురు మహిళలు మృతి!

తమిళనాడు(Tamilanadu) లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Accident)  చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

New Update
Tamilanadu Accident: తమిళనాడులో ఘోర ప్రమాదం..ఏడుగురు మహిళలు మృతి!

తమిళనాడు(Tamilanadu) లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Accident)  చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన తమిళనాడులోని తిరుపత్తూర్‌ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ తెల్లవారుజామున తిరుపత్తూరు జిల్లా నత్రంపల్లి టౌన్ సమీపంలోని సందాయ్‌ పల్లి వద్ద నేషనల్ హైవే 44 పై ఓ ట్రావెలర్ వ్యాను టైరు పంక్చర్‌ అయ్యింది.

ఈ క్రమంలో దానిని రోడ్డు పక్కన ఆపి డ్రైవర్ టైర్ మారుస్తున్నాడు. ఇది బెంగళూరు- చెన్నై హైవే కావడంతో వాహనాల రాకపోకలు చాలా స్పీడుగా ఉన్నాయి. ఈ క్రమంలోనే టైర్‌ పంక్చర్‌ అయిన వాహనంలో ఉన్న ప్రయాణికులు కిందకి దిగి రోడ్డు పక్కగా నిల్చున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన డీసీఎం వ్యాన్‌ ఆగి టైర్ మార్చుకుంటున్న వ్యాన్ ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.

దీంతో రోడ్డు పక్కన నిల్చున్న వారిలో సుమారు 7 గురు మహిళలు సంఘటన స్థలంలోనే మరణించారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

గాయపడిన వారిలో మరి కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు, వైద్యాధికారులు తెలిపారు. ఈ ప్రమాదం నుంచి వ్యాన్ డ్రైవర్ , క్లీనర్ తో మరో 10 మందిని కాపాడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన వారందరూ కూడా తమిళనాడులోని వెల్లూరు అంబూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

గ్రామానికి చెందిన సుమారు 45 మంది రెండు వ్యాన్లలో కర్ణాటక లోని ధర్మస్థలికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. దీని గురించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు