Haryana Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అంబాలా-ఢిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై అతివేగంతో వెళ్తున్న ట్రక్కు మినీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు.

New Update
Haryana Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

Seven Died in Haryana Bus Accident:హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అంబాలా-ఢిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై అతివేగంతో వెళ్తున్న ట్రక్కు మినీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బస్సులోని ప్రయాణికులు ఒకే కుటుంబానికి చెందిన వారీగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: హైదరాబాద్ అడ్డాగా కిడ్నీ రాకెట్

Advertisment
తాజా కథనాలు