Adipurush : 'ఆదిపురుష్' లో ఆ పాత్రను రోడ్ సైడ్ రౌడీలా చూపించడం బాధించింది.. సీరియల్ నటి షాకింగ్ కామెంట్స్! హిందీ రామాయణ్ సీరియల్ నటి దీపికా చిఖ్లియా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.'ఆదిపురుష్' మూవీలోని పాత్రలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సినిమాలో రావణుడి పాత్రను రోడ్‌సైడ్ రౌడీలా చూపించడం తనని బాధించిందని పేర్కొంది. By Anil Kumar 09 Jun 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Serial Actress Dipika chikhlia Shocking Comments On Adipurush : పాన్ ఇండియా హీరో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన 'ఆదిపురుష్' మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమాపై ఓ రేంజ్ లో విమర్శలొచ్చాయి. ఆడియన్స్ తో పాటూ సినీ ప్రముఖులు సైతం మూవీ టీమ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో అయితే భారీ ట్రోలింగ్ జరిగింది. ఈ సినిమా వచ్చి సుమారు ఏడాది కావస్తున్నా ఇప్పటికీ ఎవరో ఒకరు విమర్శిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ లిస్ట్ లో ఓ సీరియల్ నటి కూడా చేరింది. హిందీ రామాయణ్ సీరియల్‌లో సీతగా నటించిన దీపికా చిఖ్లియా తాజాగా ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 'ఆదిపురుష్' మూవీలోని పాత్రలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. Also Read : ప్లీజ్.. చిరాకు తెప్పించకండి: పవన్ ఫ్యాన్స్ పై రేణూ ఫైర్! రోడ్ సైడ్ రౌడీలా చూపించడం బాధించింది. " ఆదిపురుష్ చూసిన పిల్లలు రామాయణం అంటే ఇలానే ఉంటుందేమోనని భావిస్తారు. అది భవిష్యత్తుకే ప్రమాదకరం. ఆ విషయం తలచుకుంటే బాధేస్తుంది. ఈ చిత్రంలో చూపించినట్లు రావణుడు ఉండడని వాళ్లకు ఎవరూ వివరించడం లేదు. దీంతో రామాయణంలో రాముడు, సీత కూడా ఇలానే ఉంటారని వారు నిర్ణయించుకుంటున్నారు. రావణుడు గొప్ప శివభక్తుడు. ఆయనలో చాలా మంచి లక్షణాలున్నాయి. ఆయన జీవితంలో చేసిన ఒకేఒక్క తప్పు సీతను అపహరించడమే. ఆ ఒక్కటి చేయకపోతే ఆయన గొప్ప పండితుడిలా ఉండేవారు. అంత గొప్ప వ్యక్తిని ‘ఆదిపురుష్’లో రోడ్‌సైడ్ రౌడీలా చూపించడం నన్ను బాధించింది. నేను ఈ సినిమాను ఇప్పటివరకు పూర్తిగా చూడలేదు. టీవీలో కొంతభాగం చూసేసరికే తట్టుకోలేకపోయాను. ఏమాత్రం నచ్చలేదు... సీతాదేవిని గులాబీరంగు చీరలో చూపడం, రావణాసురుడిని విభిన్నమైన ఆహార్యంలో చూపించడం ఏమాత్రం నచ్చలేదు. సృజనాత్మకంగా ఏదో కొత్తగా చూపించాలనే తాపత్రయంలో రామాయణం గొప్పతనాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ ఇతిహాసాల జోలికిపోకుండా యువతలో స్ఫూర్తి నింపే స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రలను సినిమాలుగా తీస్తే బాగుంటుంది" అని చెప్పుకొచ్చింది. #adipurush-movie #serial-actress-dipika-chikhlia మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి