అసలు బర్రెలక్క ఎవరు?.. కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి సంచలన వ్యాఖ్యలు.!

ఆర్టీవీతో కొల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు బర్రెలక్క ఎవరో తెలియదని.. ఆమె ముక్కు మొహం కూడా తాను చూడలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బర్రెలక్క హాట్ టాపిక్ గా మారగా.. జూపల్లి ఇలా వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది.

అసలు బర్రెలక్క ఎవరు?.. కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి సంచలన వ్యాఖ్యలు.!
New Update

Telangana Elections 2023: ఆర్టీవీతో కొల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు బర్రెలక్క ఎవరో తెలియదని.. ఆమె ముక్కు మొహం కూడా తాను చూడలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్రెలక్క హాట్ టాపిక్ గా మారగా.. జూపల్లి ఇలా వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది. ఈ క్రమంలోనే అధికార పార్టీ బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. మద్యం, డబ్బుతో ప్రజల ఓట్లను కొనుగోలు చేసిందని ఆరోపించారు. బీజేపీ అయితే చీరలు, ముక్కుపుడకలు, గ్యాస్ ఫ్రీ గా ఇస్తామని ప్రలోభాలు చేస్తున్నాయని విమర్శలు గుప్పించారు.

బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండు కలిసే పనిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు పార్టీలు కలిసే ప్రచారం చేస్తున్నాయని..రెండు పార్టీలు కలిసే డబ్బు పంచుతున్నాయని కామెంట్స్ చేశారు. అంతేకాకుండా, కొల్లాపూర్ నియోజకవర్గంలో బీజేపీ ఓటు బీఆర్ఎస్ కే అంటున్నారని వ్యాఖ్యనించారు. అధికార పార్టీ  అన్ని పార్టీలను బెదిరిస్తోందని అన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి ఓటు వేయకుండా వారిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

Also Read: శభాష్ .. ఆక్సిజన్ సిలిండర్ తో పోలింగ్ కేంద్రానికి వచ్చిన శేషయ్య.!

అయితే, బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఎత్తుగడలు వేసిన ప్రజలు వారిని ఇంటికి పంపేందుకు డిసైడ్ అయ్యారని అన్నారు. అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్..ఇంటికి పోయేది బీఆర్ఎస్ అని తేల్చి చెప్పారు. ఈ సారి కచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని ధీమ వ్యక్తం చేశారు. 70 సీట్ల కన్నా ఎక్కువే వస్తాయని స్పష్టం చేశారు. కేవలం ఓటమి భయంతోనే అధికార పార్టీ పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు సృష్టిస్తోందని ఆరోపించారు.

#telangana-election-2023
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe