Actor Subbalakshmi passed away: చిత్ర పరిశ్రమలో మరో విషాదం. సీనియర్ నటి ఆర్. సుబ్బలక్ష్మీ కన్నుమూశారు. కొంత కాలంగా అస్వస్థతతో భాదపడుతున్న సుబ్బలక్ష్మీ గురువారం కొచ్చీలోని ఓ ప్రవైట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయాన్నీ సుబ్బలక్ష్మీ మనవరాలు సౌభాగ్య తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇది తెలిసిన పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు సుబ్బలక్ష్మీ మృతుకి నివాళులర్పించారు.
Also Read: Vijaykanth Health: తమిళ నటుడు విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి విషమం..
నటిగా సుబ్బలక్ష్మీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 70 కి పైగా చిత్రాల్లో నటించారు. సినిమా రంగంలోకి రాకముందు సుబ్బలక్ష్మీ జవహర్ బాల భవన్ లో సంగీత విద్వాంసురాలు, నృత్య శిక్షకురాలిగా పని చేశారు. 1951 లో సౌత్ ఇండియా నుంచి ఆల్ ఇండియా రేడియోలో మొదటి మహిళా స్వరకర్తగా ప్రసిద్ధి పొందారు. మలయాళంలో కళ్యాణరామన్ , పందిప్పాడ, నందనం చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చాయి. తెలుగులో కల్యాణ రాముడు, ఏ మాయ చేశావే చిత్రాల్లో కనిపించారు. ఏ మాయ చేశావే సినిమాలో సమంతకు అమ్మమ గా నటించారు. వెండి తెర పై మాత్రమే కాదు బుల్లితెర పై కూడా పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగులో సుబ్బలక్ష్మీ చివరిగా నటించిన చిత్రం బీస్ట్.
Also Read: విజయకాంత్ చనిపోయారనే ప్రచారం.. భార్య రియాక్షన్ ఇదే.!