Nellore: వైసీపీ సీనియర్ నేత, డిప్యూటీ మేయర్ పార్టీకి రాజీనామా..! నెల్లూరు వైసీపీ సీనియర్ నేత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పార్టీకి రాజీనామా చేశారు. గత 13 సంవత్సరాలుగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేశానన్నారు. ఇటీవల వైసీపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. By Jyoshna Sappogula 28 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి Deputy Mayor Roop Kumar Yadav: ఏపీ అధికార పార్టీ వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే టికెట్ దక్కని మాజీ మంత్రులు, ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి గుడ్ బై చెప్పారు. అటూ టీడీపీలో సీటు దక్కని పలువురు ముఖ్య నేతలు పార్టీని వీడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. Also Read: క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాలా ప్రమాదం.. నిర్దారించిన తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ! వైసీపీ సీనియర్ నేత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నెల్లూరు నగరంలోని స్థానిక జేమ్స్ గార్డెన్లోని కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన ఆవేదనను వ్యక్తం చేశారు. పార్టీని వీడుతున్నందుకు ఎమోషనల్ అయ్యారు. గత 13 సంవత్సరాలుగా వైసీపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేశానన్నారు. ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. Also Read: పెళ్లి ప్రతిపాదన కార్యరూపం దాల్చకపోవడం మోసం కాదు: సుప్రీంకోర్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన దగ్గర్నుంచి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తన రక్తాన్ని చెమటగా మార్చి పనిచేశానన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తమ సొంత పార్టీగా భావించామని, ప్రతిపక్షాలతో నిరంతరం పోరాటం చేశానన్నారు. మార్పు సహజం.. మార్పు అనివార్యమని కమ్యూనిస్టు సిద్ధాంతకర్త కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పారన్నారు. వైసీపీ కోసం పునాదులుగా పనిచేస్తే గత ఒకటి న్నర సంవత్సరాలగా కొన్ని రాజకీయ పరిస్థితులు తనను బాధ పెట్టాయన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేయడం ఎంతో బాధాకరమైన విషయమన్నారు. రాజీనామా ప్రకటన చేస్తున్నప్పుడు రూప్ కుమార్ యాదవ్ కన్నీటి పర్యంతమయ్యారు. #andhra-pradesh #roop-kumar-yadav మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి