AP New CS: ఏపీ సీఎస్ జవహర్ ఔట్.. కొత్త సీఎస్ ఎవరంటే?

ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లనున్నారు. సీఎస్ సెలవుపై వెళ్లగానే కొత్త సీఎస్ నియామకం ఉంటుందని తెలుస్తోంది. అయితే కొత్త సీఎస్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ ను ఈ రోజు సాయంత్రం గవర్నర్ నియమించనున్నట్లు తెలుస్తోంది.

New Update
AP New CS: ఏపీ సీఎస్ జవహర్ ఔట్.. కొత్త సీఎస్ ఎవరంటే?

ఏపీలో ప్రభుత్వం మారడంతో.. గత ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన అధికారుల్లో టెన్షన్ పట్టుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి సెలవు పై వెళ్లనున్నట్లు తెలుస్తోంది. నిన్న చంద్రబాబుతో జవహర్ రెడ్డి భేటీ అయ్యారు. వ్యక్తిగత కారణాలతో సెలవు పై వెళుతున్నట్లు కాబోయే ముఖ్యమంత్రికి ఆయన తెలిపినట్లు సమాచారం. GAD పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ ను ఈ మేరకు సీఎస్ లీవ్ కావాలని కోరినట్లు తెలస్తోంది. కాసేపట్లో ఈ మేరకు లీవ్ లెటర్ పంపనున్నట్లు తెలుస్తోంది. ఇదే నెలతో ప్రస్తుత సీఎస్‌ జవహర్‌రెడ్డి పదవీ కాలం ముగియనుంది. గత ప్రభుత్వ హయాంలో సీఎస్ గా నియమించబడిన జవహర్‌రెడ్డిపై కాబోయే సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సెలవుపై వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

సీఎస్ సెలవుపై వెళ్లగానే కొత్త సీఎస్ నియామకం ఉంటుందని తెలుస్తోంది. సాయంత్రానికి కొత్త సీఎస్ ను గవర్నర్ నియమించనున్నట్లు సమాచారం. అయితే.. ఏపీ కొత్త సీఎస్‌గా 1992 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కె.విజయానంద్ ను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శిగా విజయానంద్‌ ఉన్నారు. సాయంత్రానికి కొత్త సీఎస్‌ను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు