కాదేదీ రాహుల్‌కు అనర్హం, ట్రాక్టర్ నడిపి..వరి నాటేసిన కాంగ్రెస్ సీనియర్ నేత..!! కాంగ్రెస్ సీనియర్ నేత.. రాహుల్ గాంధీ శనివారం ఉదయం అకస్మాత్తుగా ఢిల్లీకి ఆనుకుని ఉన్న సోనేపట్‌కు చేరుకున్నారు. అక్కడ పొలాల్లో పని చేస్తున్న రైతులతో ముచ్చటించారు. అంతేకాదు పొలంలో ట్రాక్టర్ దున్నాడు. గోహనాలోని బరోడా ప్రాంతానికి వచ్చిన రాహుల్ గాంధీ పొలాల్లో వరి నాట్లు వేస్తూ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. By Bhoomi 08 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ...సుడిగాలి పర్యటనలు చేస్తుంటారు. ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షమవుతారో ఎవరికీ అంతుపట్టదు. ఒకసారి లారీలో ప్రయాణం చేస్తే...మరోసారి జొమాటో డెలివరీ బాయ్ తో కలిసి చక్కర్లు కొడుతాడు. ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ...ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ దేశ ప్రజలకు చేరువయ్యారు. ఒక సామాన్య పౌరుడిలా ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇఫ్పుడు తాజాగా దేశ రాజధాని ఢిల్లీకి ఆనుకుని ఉన్న సోనేపట్ కు వెళ్లారు. అక్కడ రైతులతో కలిసి ముచ్చటించారు. అంతేకాదు ట్రాక్టర్ తో పొలం దుక్కి దున్నారు. అనంతరం గోహనాలోని బరోడా ప్రాంతానికి చేరుకున్న రాహుల్ గాంధీ పొలాల్లో రైతులతో కలిసి వరి నారు నాట్లు వేసి రైతులతో ముచ్చటించారు. అయితే రాహుల్ గాంధీ భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు రైతులను రాహుల్ కు దగ్గర వరకు రానివ్వలేదు. ఈ సందర్భంగా దారి పొడవునా పలుచోట్ల పొలాలను పరిశీలించారు. మదీనాలో పొలాల్లో వరి నాట్లు గురించి తెలుసుకుని స్వయంగా కూలీలతో కలిసి వరి నాట్లు వేశారు. రాహుల్ గాంధీ హఠాత్తుగా కనిపించడంతో రైతులు ఆశ్చర్యపోయారు. అంతకుముందు రాహుల్ గాంధీ ఢిల్లీలోని కరోల్ బాగ్ మార్కెట్‌లో సందడి చేశారు. అక్కడ కార్మికులు, సైకిల్ వ్యాపారులతో ఆయన మాట్లాడారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ సైకిల్ మెకానిక్‌లతో సంభాషిస్తూ సైకిళ్లను రిపేర్ చేస్తూ కనిపించారు. రాహుల్ గాంధీ ఫోటోను పంచుకుంటూ, ఈ చేయి భారతదేశాన్ని తయారు చేస్తుందని ట్వీట్ చేశారు. ఈ దుస్తులపై ఉన్న మసి మన గర్వం. అలాంటి చేతులను ప్రోత్సహించే పని ఒక వ్యక్తికి మాత్రమే ఉన్నారని కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వీడియో షేర్ చేసింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి