Senior Actress Simran : మలయాళ చిత్ర పరిశ్రమను హేమా కమిటీ రిపోర్ట్ మలయాళ అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. మహిళలపై నటులు, దర్శకులు, నిర్మాతలు లైంగిక వేధింపులకు పాల్పడటం ఇండస్ట్రీ అంతా చర్చనీయాంశం అయింది. కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాత ఒక్కొక్కరుగా తమకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు నిర్భయంగా బయటపెడుతున్నారు.
ఇలా ఇప్పటికే పలువురు నటీమణులు హేమా కమిటీ రిపోర్ట్ ను ఉద్దేశించి మాట్లాడగా.. తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ సైతం దీనిపై నోరు విప్పారు. ఈ మేరకు తాను కూడా లైంగింక వేధింపులు ఎదుర్కొన్నట్టు తెలిపారు. ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ.." ఇప్పుడు నటీమణుల వేధింపుల వ్యవహారం పెద్ద చర్చకే దారి తీస్తోంది. నిజం చెప్పాలంటే నేనూ అలాంటి బాధితురాలినే.
Also Read : వరద బాధితులకు ‘పుష్ప’ నిర్మాతల విరాళం..
ఒక యువతిపై లైంగిక వేధింపుల దాడి జరిగితే వెంటనే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించడం దారుణం. ఆ సంఘటన గురించి వెంటనే ఎలా చెప్పగలరు ? మన చుట్టూ ఎం జరుగుతుందో తెలుసుకోవడానికే చాలా సమయం పడుతుంది. సహనం పాటించి ఆలోచించి ఆ తరువాతనే రియాక్ట్ అవ్వగలం. అందుకు సమయం తప్పనిసరిగా అవసరం. చిన్న తనంలో ఇలాంటి సమస్యలను చాలాసార్లు ఎదుర్కొన్నాను. వాటి గురించి ఇప్పుడు చెప్పలేను" అని అన్నారు.