Rajasekhar : ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నాం.. కాస్త పట్టించుకోండి, వైరల్ అవుతున్న సీనియర్ హీరో ట్వీట్ సీనియర్ హీరో రాజశేఖర్ డ్రైనేజీ లీకేజీ సమస్యపై ట్విట్టర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 70లోని అశ్విని హైట్స్ వద్ద డ్రైనేజీ లీకేజీ సమస్య ఎన్నాళ్లుగా వేధిస్తోంది. దయచేసి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను" అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు. By Anil Kumar 30 Jul 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Senior Actor Rajasekhar : ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ తమ నివాస ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లోని డ్రైనేజీ లీకేజీ సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఎన్నోసార్లు జీహెచ్ఎంసీని ఆదుకోవాలని కోరినా ఫలితం లేకపోవడంతో నిరాశ చెందినట్లు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్లో.. "జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 70లోని అశ్విని హైట్స్ వద్ద డ్రైనేజీ లీకేజీ సమస్య ఎన్నాళ్లుగా వేధిస్తోంది. జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదు. దయచేసి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను" అని పేర్కొన్నారు. ఈ మేరకు అక్కడి పరిస్థితిని తెలియజేసే ఫోటోను పోస్ట్ చేస్తూ.. జీహెచ్ఎంసీ కమిషనర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ లను ట్యాగ్ చేశారు. దీంతో రాజశేఖర్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. Also Read : పాపం.. సిగ్నల్స్ దగ్గర అడుక్కుంటున్న కుర్చీ తాత.. వీడియో వైరల్ There has been a drainage leak at Ashwini heights, Road no 70, Jubilee Hills, 500033 since ages. We have been speaking to @GHMCOnline to fix it, which hasn’t been done yet. Requesting @CommissionrGHMC @gadwalvijayainc @GHMCOnline to please, immediately look into it. pic.twitter.com/IXK8MrumZE — Dr.Rajasekhar (@ActorRajasekhar) July 29, 2024 ఇక రాజశేఖర్ సినిమాల విషయానికి వస్తే.. చివరిసారిగా నితిన్ హీరోగా నటించిన 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించారు. వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఆయన కూతుర్లు శివాని, శివాత్మిక ఇద్దరూ టాలీవుడ్ లో హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. #senior-actor-rajasekhar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి