Senior Actor R.Narayana Murthy Admitted In Hospital : ప్రముఖ సీనియర్ నటుడు, దర్శకనిర్మాత ఆర్. నారాయణ మూర్తి ఆసుపత్రిలో చేరారు. స్వల్ప అస్వస్థతతో హైదరాబాద్ లోని నిమ్స్ లో అడ్మిట్ అయినట్లు తెలుస్తోంది. నీరసంగా అనిపించి నిమ్స్ కి వెళ్ళిన నారాయణ మూర్తికి వైద్యులు జనరల్ టెస్ట్ లు చేశారు. డాక్టర్ బీరప్ప నేతృత్వంలో ఆయనకు టెస్ట్ లు జరిగినట్లు తెలుస్తోంది. రెండు నెలల క్రితం నారాయణ మూర్తి గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు.
అయితే తాజాగా ఆయనకు చేసినవి సాధారణమైన టెస్ట్ లే అని.. చికిత్స లో భాగంగా ఆయన క్రమంగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. తెలుగు సినీ పరిశ్రమలో వేగు చుక్కలు, చీమల దండు, ఎర్ర సైన్యం, ఒరేయ్ రిక్షా, దండోరా, ఊరు మనదిరా, వీర తెలంగాణ, పోరు తెలంగాణ వంటి ఎన్నో విప్లవ సినిమాలు తీసి పీపుల్ స్టార్ అనే బిరుదును కైవసం చేసుకుని నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read : సినిమాలకు గ్యాప్ అందుకే వచ్చింది.. దగ్గుబాటి రానా ఆసక్తికర వ్యాఖ్యలు!
నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా పని చేశారు. అయితే కొన్నేళ్లుగా ఆయన చేస్తున్న సినిమాలేవీ ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు. గత ఏడాది ఆయన హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించి 'యూనివర్సీటీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నారాయణ మూర్తి ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
ఆరోగ్యంగానే ఉన్నా...
కాగా నారాయణ మూర్తి తన ఆరోగ్యంపై స్పందించాడు. "నేను ఆరోగ్యంగానే ఉన్నా. నా ఆరోగ్యం గురించి అభిమానులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాను. దేవుడి దయవల్ల బాగానే కోలుకుంటున్నాను. నేను కోల్కున్నాక నా ఆరోగ్యం గురించి అన్ని వివరాలు చెబుతాను" అని అన్నారు.