Selfie: మనదేశంలోనే సెల్ఫీ పిచ్చి ఎక్కువ.. అందుకే ఈ చావులు!

దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన సెల్ఫీలు షార్క్ దాడుల కంటే ఐదు రెట్లు ఎక్కువ మందిని చంపేశాయి.ప్రపంచవ్యాప్తంగా సెల్ఫీలు తీసుకుంటూ కనీసం 259 మంది మరణించారు.

Selfie: మనదేశంలోనే సెల్ఫీ పిచ్చి ఎక్కువ.. అందుకే ఈ చావులు!
New Update

Selfie: హాయ్‌.. సెల్ఫీ(Selfie).. అందమైన క్షణాలను పంచుకునేందుకు.. జీవితాంతం వాటి తాలుక జ్ఞాపకాలను గుర్తు పెట్టుకునేందుకు ఇది ఓ బ్యూటిఫుల్‌ ఆప్షన్.. అయితే ఈ అందం, ఆనందం వెనుక అంతులేని విషాదాలు కూడా ఉంటుండడం బాధాకరం. దేనిపైనా పిచ్చి ఉండకూడదు. అందుకు సెల్ఫీ మినాహాయింపు కాదు.. ఇటివలీ దుర్గం చెరువు వంతెనపై జరిగిన ఘోరానికైనా.. గతంలో రైళ్ల పట్టాలపై పడి ప్రాణాలు వదిలిన యువకుడికైనా కారణం సెల్ఫీ. ఎందుకు సెల్ఫీలంటే అంత పిచ్చి? ఇండియాలోనే సెల్ఫీ చావులు ఎక్కువ? గణాంకాలు ఏం చెబుతున్నాయి?

ఏప్రిల్ 6న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి (Cable bridge)పై సెల్ఫీలు దిగుతున్న ఇద్దరు వ్యక్తులను ఎస్‌యూవీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఇలా సెల్ఫీ కారణంగా చనిపోయే వారి సంఖ్య ప్రతీఏడాది పెరుగుతూ పోతంది. ఇండియాను సెల్ఫీ మరణాల రాజధానిగా అంతర్జాతీయ మీడియా పత్రికాలు రాసుకొస్తున్నాయి. అందుకు కొన్ని లెక్కలను చూపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సెల్ఫీ మరణాలు నమోదైన దేశం ఇండియానే!

గత దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన సెల్ఫీలు షార్క్ దాడుల కంటే ఐదు రెట్లు ఎక్కువ మందిని చంపేశాయి. అక్టోబర్ 2011 - నవంబర్ 2017 మధ్య, ఇండియాస్ జర్నల్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్ అండ్ ప్రైమరీ కేర్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సెల్ఫీలు తీసుకుంటూ కనీసం 259 మంది మరణించారు. అదే సమయంలో షార్క్‌ల వల్ల కేవలం 50 మంది మరణించారు. ఈ 259మందిలో 159మంది భారతీయులే ఉండడం చూస్తుంటే కొందరికి సెల్ఫీ అడీక్షన్‌గా మారిందని స్పష్టమవుతోంది.

కొన్ని సుందరమైన ప్రదేశాలు సెల్ఫీ మరణాలతో ముడిపడి ఉన్నాయి. ఇందులో కాలిఫోర్నియాలోని యోస్మైట్ నేషనల్ పార్క్ కూడా ఉంది. ఆస్ట్రేలియాలో కొండ చరియలు, సహజ కొలనులు, జలపాతాల వద్ద ఎక్కువ మంది సెల్ఫీలు తీసుకుంటూ మరణించారు. ఇటు ఇండియాలో ప్రదేశాలతో సంబంధమే లేకుండా రైల్వే ట్రాక్‌ల వద్ద, ఇంటి బాల్కనీలోనూ మరణించిన ఘటనలు ఉన్నాయి. ప్రమాదకరమైన సెల్ఫీలు కేవలం మూర్ఖత్వం మాత్రమే కాదని.. వారిని ప్రజారోగ్యానికి హాని కలిగించే మనుషులగా పరిగణించాల్సి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

Also read: నగరంలో తాగునీటికి కటకట… రోజుకి 6 వేలకు పైగా ట్యాంకర్ల బుకింగ్!

#selfie #deaths #india
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి