TBJP: బీజేపీ అభ్యర్థుల ఎంపిక షూరు.. దరఖాస్తులకు ఆహ్వానం

తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అభ్యర్థుల ఎంపికపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈనెల 4 నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. ఈనెల 4 నుంచి 10వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

New Update
BJP Candidate List: బీజేపీ తొలి జాబితా విడుదల..64 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాషాయం పార్టీ..!!

తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అభ్యర్థుల ఎంపికపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈనెల 4 నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. ఈనెల 4 నుంచి 10వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల ఇంఛార్జిలుగా ప్రకాష్ జవడేకర్, సునీల్ బన్సాల్‌లను అధిష్టానం నియమించింది. ఎలాంటి రుసుము లేకుండా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది.

మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ (BJP) హైకమాండ్ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఇందుకోసం వెయ్యి మంది కమలదళం రంగంలోకి దిగింది. మూడు బృందాలుగా ఇతర రాష్ట్రాల నేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. పది మంది జాతీయ నేతలు ఇప్పటికే రాష్ట్రంలో పాగా వేశారు. మొదటి బృందంలో వంద మందికి పైగా ప్రజాప్రతినిధులు ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతూ క్షేత్రస్థాయి పరిస్థితులపై.. నివేదిక తయారుచేసే పనిలో ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నిమగ్నమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) టీంలోని వంద మంది సభ్యులు కూడా ఇందులో ఉన్నారు.

Also Read: వాళ్లతో ఇప్పుడే కాదు..భవిష్యత్‌లోనూ కలిసేది లేదు.. కుండబద్దలు కొట్టిన అమిత్‌షా!

గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమిత్ షా..

తెలంగాణ ఎన్నికలను బీజేపీ పెద్దలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దక్షిణాదిలో పాగ వేయాలని భావిస్తున్న కమలనాథులకు.. అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక కూడా ఇటీవల చేజారిపోయింది. దీంతో తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడ ఎలాగైనా అధికారం చేజిక్కించుకుని మళ్లీ దక్షిణాది రాష్ట్రాల్లో తన ప్రాతినిథ్యం చూపించాలని ఊవిళ్లురుతోంది. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ గెలుపును అమిత్ షా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన వరుస పర్యటనలు చేస్తూ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పార్టీలో చేరికల విషయంలోనూ ఆయనే ముందుండి నడింపించనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వేదికగా తెలంగాణ బీజేపీ వార్ రూమ్ ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసి.. ఎప్పుడు ఏ అంశంపై స్పందించాలి.. ఎవరు ప్రెస్ మీట్ పెట్టాలనే అంశంపై కూడా దిశానిర్దేశం చేయనున్నారు.

ఢిల్లీ వార్ రూమ్ నుంచి దిశా నిర్దేశం..

అందుకే కీలక నేతలందరినీ అసెంబ్లీ బరిలో దించుతున్నారు. గతంలో ఎంపీగా పోటీ చేసి గెలిచిన కిషన్ రెడ్డి (Kishan reddy), బండి సంజయ్ (Bandi Sanjay), ధర్మపురి అరవింద్ (Dharmapuri Aravind), సోయం బాపూరావు వంటి నేతలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మిషన్ 75 టార్గెట్‌ను బీజేపీ పెట్టుకుంది. గెలిచే అవకాశమున్న స్థానాలను గుర్తించడంతో పాటు 50 మంది కీలక నేతలను గుర్తించి ఎన్నికలకు సిద్ధమయ్యేలా ఇప్పటికే ఆదేశించింది. బలమైన బీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు ఓ ప్రత్యేకమైన టీమ్ పని చేస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు