PUBG Love: ఆమె ప్రేమ నిజం కాదా.. పాక్ ఏజెంట్‌గా ఇండియా వచ్చిందా? సీమా హైదర్.. కొన్నిరోజులుగా వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. పబ్జీ ఆడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో పడి అతడి కోసం పిల్లలతో సహా అక్రమంగా ఇండియాకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆమెను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. By BalaMurali Krishna 18 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి ఢిల్లీలో ముందే పరిచయాలు.. పబ్జీ గేమ్‌లో పరిచయమైన ఇండియా బాయ్ ఫ్రెండ్ కోసం సీమా హైదర్ అనే మహిళ తన నలుగురు పిల్లలతో సహా పాకిస్థాన్ నుంచి నేపాల్ మీదుగా అక్రమంగా ఇండియా చేరుకుంది. అప్పటి నుంచి ఆమె వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. పాక్ నుంచి వచ్చిన ఆమె తొలుత కలిసింది లవర్ సచిన్ మీనాను కాదని తేలింది. ఇంతకుముందే ఆమెకు ఢిల్లీలో ఉన్న కొంతమందితో పరిచయాలు ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. చాలా తెలివిగా సమాధానాలు.. విచారణలో తాము అడిగే ప్రశ్నలకు ఆమె చాలా తెలివిగా ఆచితూచి సమాధానాలు చెబుతున్నట్లు తెలిపారు. దీంతో సీమా నుంచి ముఖ్యమైన సమాచారం రాబట్టడం అంత సులువ కాదని నిర్థారణకు వచ్చామని పేర్కొన్నారు. ఆమె ఇంగ్లీష్ భాష అనర్గళంగా మాట్లాడటం చూసి తమకు ఆశ్చర్యమేసిందని చెప్పారు. కచ్చితంగా తన నుంచి మరింత సమాచారం రాబట్టాలని వెల్లడించారు. మరోవైపు సీమా పాక్ ఏజెంట్ అని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన మేసేజ్‌పై కూడా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. పాక్ పంపించాలని కోరుతున్న భర్త.. అంతకుముందుకు ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ పారిపోయేందుకు ప్రయత్నించగా నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీసా లేకుండా అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించడమే కాకుండా ఇక్కడే ఉంటున్నందుకు ఆమెతో పాటు సచిన్ మీనా, అతడి తండ్రిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే వారికి కోర్టులో బెయిల్ లభించింది. దీంతో ముగ్గురిని యూపీ యాంటీ టెర్రరిస్ట్ పోలీసులు విచారిస్తున్నారు. అటు పాకిస్థాన్‌లోని ఆమె భర్త కుటుంబీకులు సైతం ఆమెను తమ దేశానికి పంపించాలని కోరుతున్నారు. కానీ సీమా మాత్రం తాను హిందువుగా మారిపోయానని.. తిరిగి వెళ్లనని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆమె అసలు పాక్ ఏజెంట్‌నా? కాదా? అని తేల్చే పనిలో అధికారులు ఉన్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి