కాంగ్రెస్ లో సికింద్రాబాద్ సీట్ లొల్లి..అజారుద్దీన్ దారెటు..?

కాంగ్రెస్ లో సికింద్రాబాద్ సీట్ లొల్లి.. మళ్లీ తానే పోటీ చేస్తానని అంజన్ కుమార్ యాదవ్ పట్టు..ఈ సారి సికింద్రాబాద్ స్థానం నుంచి బరిలోకి దిగుతానని పార్టీ అధిష్టానానికి చెప్పిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్.. సికింద్రాబాద్ యాదవులదే అంటున్న యాదవ సంఘాలు..

కాంగ్రెస్ లో సికింద్రాబాద్ సీట్ లొల్లి..అజారుద్దీన్ దారెటు..?
New Update

ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అప్పుడే ప్రధాన పార్టీల్లో సీట్ల లొల్లి స్టార్ట్ అయింది. కొన్ని కీలక సీట్ల విషయంలో మాజీలు, సిట్టింగుల మధ్య నెలకొన్న వార్ పార్టీ బాస్ లకు తలనొప్పిగా మారుతోంది. ఇక కొందరైతే బహిరంగంగానే ఆ సీట్ నాదేనని ప్రకటనలు చేస్తుండడంతో పార్టీల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు.. అసంతృప్తులు ఈ సారైనా టికెట్ వస్తుందా.. రాదా అన్నది ఎంత త్వరగా అయితే అంత త్వరగా తేల్చుకోవాలని కసరత్తు చేస్తున్నారు.

ఎందుకంటే ఈ సారి కూడా సీట్ రాకపోతే.. వేరే పార్టీలోకి జంప్ అవ్వడమే రాజకీయ ప్రస్తానానికి మంచిదని భావిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల అధినాయకత్వానికి అసంతృప్తులను బుజ్జగించడం పెద్ద టాస్క్ గా మారింది. దీంతో టికెట్ కోసం పట్టుబడుతున్న వారిలో కొందరినైనా శాతింపచేయడానికి ఆయా పార్టీలు నామినేటెడ్ పోస్టులను ఎర వేసి.. వాళ్లు చేతిలో నుంచి జారి పోకుండా కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ లో అయితే సర్వసాధారణంగా ఉండే సీట్ల లొల్లి ఈ సారి పార్టీ కాస్త ఊపులోకి వెళ్లడంతో..ఇంకా పీక్స్ కు వెళ్ళింది.

తాజాగా సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని ట్రై చేస్తున్న భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ విషయంలో పెద్ద రగడే చోటుచేసుకుంది. సికింద్రాబాద్ నుంచి అజహరుద్దీన్ ను పోటీకి దింపే ప్రసక్తే లేదని.. ఏఐసీసీ కార్యదర్శి ఎన్ఎస్ బోస్ రాజు ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో అంజన్ కుమార్ యాదవ్ వర్గం నిరసనకు దిగింది. దీంతో సికింద్రాబాద్ సీట్ యాదవులకే చెందుతుందని చెప్పి కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఆందోళనకారులను శాంతింపచేసే ప్రయత్నం చేశారు.

ఆ స్థానం నుంచి నేనే పోటీ చేస్తా..

గ్రేటర్ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడిగా ఉన్న అంజన్ కుమార్ యాదవ్ మళ్లీ తానే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తానని ఖరాఖండిగా చెబుతున్నారు. దీనికి యాదవ సంఘాల పూర్తి మద్దతు తనకు ఉందని పార్టీ పెద్దల ముందు ప్రస్తావన పెట్టారు. కాగా, అంజన్ కుమార్ యాదవ్ 2004 ఇంకా 2009 లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. అయితే 2014 లో బీజేపీ అభ్యర్థి బండారు దత్తాత్రేయ చేతిలో ఓటమి పాలయ్యారు.

హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి అజారుద్దీన్..

సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం మాత్రం ఇచ్చేది లేదని.. తానే పోటీ చేస్తానని పట్టుబడుతున్న అంజన్ యాదవ్.. అజారుద్దీన్ హైదరాబాద్ ఎంపీ సీట్ నుంచి పోటీ చేయాలని సూచిస్తున్నారు. దానికైతే తాము మద్దతు తెలుపుతామని అంటున్నారు. కాగా, చాలా కాలం నుంచి హైదరాబాద్ లోక్ సభ నియోజక వర్గం నుంచి అజారుద్దీన్ పోటీ చేయాలన్న ప్రస్తావన ఉంది. గత ఎన్నికల్లో కూడా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పై పోటీ చేయాలని పార్టీ కోరింది. అయితే మూడు దశాబ్దాలుగా ఎంఐఎం ఆధీనంలో ఉన్న హైదరాబాద్ నుంచి పోటీ చేసేందుకు అజారుద్దీన్ సుముఖత చూపించడం లేదు.

ఇక 2009 లో ఉత్తర ప్రదేశ్ లోని మురాదాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ పై అజారుద్దీన్ గెలిచారు. తరువాత 2014 లో రాజస్థాన్ లో టోంక్ సవాయి మాధోపూర్ నుంచి కాంగ్రెస్ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. అందుకే ఈసారి ఖచ్చితంగా తన స్వస్థలం నుంచే బరిలోకి దిగాలని ఆయన భావిస్తున్నారు. దీని కోసం సింకింద్రాబాద్ అయితే బెటర్ అని ఆయన రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జికి తెలిపారు. కాని సికింద్రాబాద్ ను ఇచ్చేదే లేదని అంజన్ కుమార్ యాదవ్ భీష్మించుకొని కూర్చున్న నేపథ్యంలో మరి.. పార్టీ అధిష్టానం అజారుద్దీన్ కు వేరే ఆప్షన్ ఏం చూపిస్తుందనేది ఆసక్తిగా మారింది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి