War Tragedy: మానవ చరిత్ర మొత్తం రక్తసిక్తమే. అధికారం కోసం.. బతుకు కోసం.. మనుగడ కోసం ఇప్పటివరకూ లెక్కలేనన్ని యుద్దాలు జరిగాయి. దేశాల మధ్య ప్రపంచ యుద్ధాలే రెండుసారులు జరిగాయి. ఈ యుద్ధాలలో చాలా వాటికి చరిత్రలో అనేక కథలు సాక్ష్యంగా నిలిచాయి. కొన్నిటికి సంబంధించిన అలనాటి ఆనవాళ్లు బాంబ్ షెల్స్ రూపంలో.. శిధిలాలుగా మిగిలిపోయిన కట్టడాల రూపంలో ప్రపంచంలో ప్రతిమూలా కనిపిస్తూనే ఉన్నాయి. యుద్ధోన్మాదానికి బలి అయిన వారి కథలూ అప్పుడప్పుడు వింటూనే వస్తున్నాం.. అయితే, మనకు కనిపిస్తున్న.. వినిపిస్తున్న చరిత్ర కంటే.. చరితకు దొరకని ఎన్నో రహస్యాలు మరుగున పడిపోయాయి. ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అంతుచిక్కకుండా పోయిన ఒక విమానం గురించిన కథ ఇది. ఇప్పుడెందుకు అంటే.. అప్పుడు తప్పిపోయిన ఒక విమానం ఇప్పుడు చెక్కు చెదరకుండా దొరికింది కాబట్టి.. ఆ కథ ఏమిటో తెలుసుకుందాం రండి.
ది నేషన్ నైజీరియా X లో ఉంచిన పోస్ట్ ప్రకారం.. అది ఆగస్ట్ 25, 1943న ఫోగ్గియా సమీపంలోని ఇటాలియన్ ఎయిర్‌ఫీల్డ్‌పై ముమ్మరంగా దాడి జరుగుతోంది. ఆ సమయంలో అమెరికాకు చెందిన ఒక P-38 మెరుపు యుద్ధ విమానం నడుపుతూ అమెరికన్ ఎయిర్‌మెన్ వారెన్ సింగర్ యుద్ధ భూమి వైపు వెళ్ళాడు. వెళ్లడం వెళ్ళాడు కానీ.. అతను.. అతని విమానం మాత్రం మళ్ళీ ఎవరికీ(War Tragedy) కనిపించలేదు. యూఎస్ ఎయిర్ ఫోర్స్ రికార్డ్స్ ప్రకారం అతను.. అతని విమానం చివరిసారిగా ఫోగ్గియాకు 22 మైళ్ల దూరంలో కనిపించాయి. తరువాత మామూలే కదా.. యుద్ధ వీరుల జాబితాలో వారెన్ సింగర్ చేరిపోయాడు. వారెన్ సింగర్ ఆగష్టు 26, 1944న మరణించినట్లు ప్రకటించారు. ఆ తరువాత ఆ విమానం గురించి అంతా మిస్టరీగా మారిపోయింది.
Also Read: అమెరికాలో భారత విద్యార్థి ని 8 నెలలుగా నిర్బంధించి..చిత్ర హింసలు!
కట్ చేస్తే.. 80 ఏళ్ల తరువాత ఇప్పుడు ఆ విమానం శిధిలాలు దొరికాయి. గల్ఫ్ ఆఫ్ మాన్‌ఫ్రెడోనియా లో 40 అడుగుల లోతున ఈ కూడా శిధిలాలను డైవర్లు అంటే ఈతగాళ్లు కనుగొన్నారు. ఈ విమాన శకలాల్ని(War Tragedy) గుర్తించిన డైవర్ డాక్టర్ ఫాబియో బిస్సియోట్టి విమానం మంచి స్థితిలో ఉందని చెప్పాడు. విమానం ఎటువంటి దాడికి గురైన ఆనవాళ్లు లేవనీ.. బహుశా సాంకేతిక లోపంతోనే ప్రమాదం జరిగి ఉండవచ్చని తెలిపాడు. ప్రమాదానికి ముందు విమానం నుంచి వారెన్ సింగర్ దూకేసినప్పటికీ.. నీటిలో మునిగిపోవడం వలన అతను మరణించి ఉండవచ్చని చెప్పాడు. ఈ విమాన శిథిలాల్లో దొరికిన 50 క్యాలిబర్ బుల్లెట్లు, ఇంజన్ క్రాంక్‌కేస్ ఆధారంగా వారెన్ విమానం అదే అని గుర్తించారు.
ఇదీ విషాదం అంటే..
మొత్తమ్మీద ఎనిమిది దశాబ్దాల తరువాత విమాన శిధిలాలు దొరకడంతో వారెన్ మనందరి హీరో అంటూ ఆయన మనవడు చెప్పినట్టు మీడియా వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడ విషాదం(War Tragedy) ఏమిటంటే.. వారెన్ మరణించేటప్పటికి అతని వయసు కేవలం 22 ఏళ్ళు.. ఇంకా విషాదం ఏమిటంటే.. అతని మరణానికి సరిగ్గా 5 నెలల ముందే అతను మార్గరెట్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వారెన్ మరణించే సమయానికి ఆమె గర్భవతి. కాలం ఇలాంటి ఎన్నో విషాదాలను చరిత్రలోకి నెట్టేస్తూ ముందుకు నడుస్తూనే ఉంటుంది.
Watch this interesting Video: