రెండో వన్డేలో రోహిత్‌ శర్మకు రెస్ట్.. కెప్టెన్‌గా హార్దిక్

వెస్టిండీస్‌తో రెండో వన్డేకు టీమిండియా సిద్ధమైంది. రెండు మార్పులతో బరిలోకి దిగింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీలకు రెస్ట్ ఇచ్చింది. దీంతో హార్దిక్ పాండ్య జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

New Update
రెండో వన్డేలో రోహిత్‌ శర్మకు రెస్ట్.. కెప్టెన్‌గా హార్దిక్

మరో కీలక మ్యాచ్‌కు భారత్ జట్టు సిద్ధమైంది. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు రెండో వన్డేలో తలపడుతోంది. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ కోసం టీమిండియా రెండు మార్పులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు రెస్ట్ ఇచ్చింది. వారి స్థానాల్లో సంజూ శామ్సన్, అక్షర్ పటేల్‌ జట్టులోకి వచ్చారు. ఇక ఆతిథ్య విండీస్ జట్టు కూడా రెండు మార్పులతో బరిలో దిగింది. పావెల్, డ్రేక్స్ స్థానాల్లో అల్జారీ జోసెఫ్, కీసీ కార్టీలకు జట్టులో చోటు దక్కింది. తొలి మ్యాచ్‌ జరిగిన కెన్సింగ్ టన్ ఓవల్ మైదానంలోనే రెండో మ్యాచ్ జరుగుతోంది. ప్రస్తుతం భారత ప్లేయర్లు ఆచితూచి ఆడుతున్నారు.

భారత జట్టు: శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, సంజూ శామ్సన్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, ముకేశ్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్

వెస్టిండీస్ జట్టు: షై హోప్ (కెప్టెన్), కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, అథనాజె, హెట్ మైర్, రొమారియో షెపర్డ్, కరియా, అల్జారీ జోసెఫ్, కార్టీ, సీల్స్, మోటీ

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జులై 27న మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో రోహిత్ సేన అద్భుతం ఆడింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టును భారత బౌలర్లు తక్కువ పరుగులకే ఆలౌట్ చేశారు. కేవలం 23 ఓవర్లలోనే 114 రన్స్‌కే కరేబీయన్ ప్లేయర్లు కుప్పకూలారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనతో బరిలో దిగిన ఇండియా ఐదు వికెట్లతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 52 పరుగులతో రాణించాడు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు రెండో వన్డేలో కూడా గెలిచి సిరీస్‌ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఇక చివరిదైన మూడో వన్డే ఆగస్టు ఒకటిన జరగనుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు