Hindenburg Issue: అందుకే ఆరోపణలు చేసి బురద చల్లుతున్నారు.. సెబీ చీఫ్ మాధవి  పూరీ బుచ్ 

హిండెన్‌బర్గ్  కు అదానీ కేసు విషయంలో నోటీసులు ఇచ్చినందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సెబీ చీఫ్ మాధవి పూరీ బుచ్ చెప్పారు. ఆ ఆరోపణల ద్వారా వ్యక్తిత్వ హననానికి హిండెన్‌బర్గ్ పాల్పడుతోందని ఆమె అన్నారు. 

New Update
Hindenburg Issue: అందుకే ఆరోపణలు చేసి బురద చల్లుతున్నారు.. సెబీ చీఫ్ మాధవి  పూరీ బుచ్ 

Hindenburg Issue: అమెరికన్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చీఫ్ మాధవి  పూరీ బుచ్ (Madhabi Puri Buch) తోసిపుచ్చారు. అదానీ గ్రూప్‌తో (Adani Group) అనుసంధానించి  ఆఫ్‌షోర్ కంపెనీలో మాదాబి,  ఆమె భర్త ధవల్ బుచ్‌కి వాటా ఉందని హిండెన్‌బర్గ్ శనివారం ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను పూరీ బుచ్ ఖండించారు. 

సెబీ చైర్‌పర్సన్ హిండెన్‌బర్గ్ ఆరోపణలు "నిరాధారమైనవి" "వ్యక్తిత్వ హననం" ప్రయత్నమని పేర్కొన్నారు. సెబీ చైర్‌పర్సన్ (SEBI Chairperson) అన్ని ఆర్థిక రికార్డులను ప్రకటించడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఆమె తన భర్త ధవల్ బుచ్‌తో (Dhaval Buch) కలిసి సంయుక్త ప్రకటనలో, 'మా జీవితం - ఆర్థిక విషయాలు తెరిచిన పుస్తకం' అని అన్నారు.

గత సంవత్సరం, అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) వెలుగులోకి తెచ్చింది. విజిల్‌బ్లోయర్ పత్రాల ఆధారంగా, బుచ్ - ఆమె భర్త మారిషస్ ఆఫ్‌షోర్ కంపెనీ 'గ్లోబల్ డైనమిక్ ఆపర్చునిటీ ఫండ్'లో వాటాలు కలిగి ఉన్నారని హిండెన్‌బర్గ్ పేర్కొంది.

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ 'గ్లోబల్ డైనమిక్ ఆపర్చునిటీస్ ఫండ్'లో బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టారని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ఈ డబ్బును అదానీ గ్రూప్ షేర్ల ధరలను పెంచేందుకు ఉపయోగించారని హిండెన్‌బర్గ్ తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే, వీటన్నిటినీ పూరీ బుచ్ అసత్యమైనవి అని స్పష్టం చేశారు. 

Also Read: మన దేశంలో చైనా మొబైల్స్ హవా.. ఆ బ్రాండ్స్ కే ఎక్కువ డిమాండ్!

Advertisment
Advertisment
తాజా కథనాలు