Libya Death toll: జల ప్రళయంలో 20 వేల మంది చనిపోతారా? లిబియాలో గుట్టలు గుట్టలుగా శవాలు!

లిబియాలో డేనియల్‌ తుఫాన్‌ జల ప్రళయం సృష్టించింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) చెప్పిన లెక్కల ప్రకారం వరదల ధాటికి కనీసం 30,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మరణాల సంఖ్య 20 వేల దాటవచ్చని సమాచారం. తూర్పు ప్రాంతాలతో పాటు పశ్చిమాన ఉన్న మిస్రాటా నగరం కూడా వరద తాకిడికి గురైంది. మరోవైపు ప్రజలు విలవిలలాడిపోతున్నా సహాయకచర్యలు మాత్రం నెమ్మదిగా సాగుతున్నాయి.

New Update
Libya Death toll: జల ప్రళయంలో 20 వేల మంది చనిపోతారా? లిబియాలో గుట్టలు గుట్టలుగా శవాలు!

Libya Death toll may increase upto 20,000: ఎటు చూసినా గుట్టలు గుట్టలుగా మృతదేహాలే కనిపిస్తున్నాయి..కాపాడాలంటూ ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. ఆఫ్రికా దేశం లిబియాలో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే. కుండపోతకు వరదలు ముంచెత్తాయి. రెండు భారీ డ్యామ్స్‌ బద్దలవడంతో వరద పోటెత్తి ప్రజలను సముద్రంలోకి లాక్కెళ్లింది. పెద్ద పెద్ద భవనాలు కూడా నీటిలో కొట్టుకుపోయాయి. ఎక్కడ చూసినా కన్నీటి దృశ్యాలే కళ్లకు కడుతున్న లిడియాలో ఇప్పటివరకు 5 వేల 100 మంది చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు. మరో 10వేల మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. అయితే ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్‌ కనిపిస్తోంది.

20 వేల మంది చనిపోతారా?
లిబియాలోని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) చెప్పిన లెక్కల ప్రకారం వరదల ధాటికి కనీసం 30,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని చెప్పారు. ఇది డేనియల్ తుఫాను కారణంగా ఎక్కువగా ప్రభావితమైంది. బెంఘాజీతో సహా ఇతర తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 6,085 మంది నిరాశ్రయులయ్యారని, మరణాల సంఖ్య ఇంకా ధృవీకరించలేదని IOM తెలిపింది. శనివారం రాత్రి లిబియా ఉత్తర తీరాన్ని డేనియల్ తుఫాను తాకింది. మరణాల సంఖ్య విషయంలో స్పష్టమైన లెక్కలు లేవు. లిబియా వరద మృతుల సంఖ్య 20,000 దాటవచ్చని భయాలు నెలకొన్నాయి. 20,000 మరణాలు సంభవించినట్లు అల్-బైడా మెడికల్ సెంటర్ డైరెక్టర్ అబ్దుల్ రహీమ్ మాజిక్ నుంచి ఈ సమాచారం వచ్చింది.


కోలుకోవడం కష్టమేనా?
డెర్నా నగరంలో మరింత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. తుఫాన్‌ ఎఫెక్ట్‌ డెర్నాపైనే ఎక్కువగా ఉందని..రోడ్లపై ఎటు చేసినా డెడ్‌బాడీలే పడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడి మంత్రులు. రెండు డ్యామ్‌లు కొట్టుకుపోవడంతో తీవ్రత మరింత పెరిగిందని..అందుకే తీవ్ర ప్రాణ నష్టం జరిగిందని తెలిపారు ప్రధాని ఒసామా హమాద్‌. తుఫాన్‌ సృష్టించిన విలయం నుంచి కోలుకోవడం కష్టమేనని..ఐనా వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఎన్నడూ లేని విధంగా పడిన కుంభవృష్టికి సునామీలా ముంచెత్తింది వరద. భారీ వర్షాలు, వరదల కారణంగా రోడ్లు ధ్వంసమయ్యాయి. బ్రిడ్జిలు కూలిపోయాయి. శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుపోయారు. డెర్నా నగరం మొత్తం నీటమునిగిపోయింది. బెంఘాజి, సౌసా, అల్‌మర్జ్‌ నగరాలు కూడా ప్రభావితమయ్యాయి. తూర్పు ప్రాంతాలతో పాటు పశ్చిమాన ఉన్న మిస్రాటా నగరం కూడా వరద తాకిడికి గురైంది.


మరోవైపు ప్రజలు విలవిలలాడిపోతున్నా సహాయకచర్యలు మాత్రం నెమ్మదిగా సాగుతున్నాయి. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ట్రిపోలీ కేంద్రంగా పనిచేసే పాలక యంత్రాంగం 14 టన్నుల వైద్య సామగ్రి, 80 మందికిపైగా వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో కూడిన ఒక విమానాన్ని పంపింది. ఈజిప్ట్‌, జర్మనీ, ఇరాన్‌, ఇటలీ, ఖతర్‌, తుర్కియే కూడా లిబియాకు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. ఇక ఐక్యరాజ్యసమితి భాగస్వాములు, లిబియా అధికారుల సమన్వయంతో తూర్పు లిబియాకు అవసరమైన సహాయాన్ని వాషింగ్టన్ నుంచి పంపించనున్నట్లు లిబియాలోని అమెరికా ప్రత్యేక రాయబారి తెలిపారు.


ALSO READ: లిబియాలో విధ్వంసం..5 వేల మందికిపైగా మృతి..రోడ్లపైనే డెడ్ బాడీలు..!

Advertisment
తాజా కథనాలు