Scrap Vehicles: పనికిరాని పాతకారు ఇచ్చేయండి.. 50 వేలు పట్టేయండి!!

పనికిరాని పాతవాహనాలను ప్రభుత్వానికి అప్పచెప్పడం ద్వారా కొత్త వాహన కొనుగోలు సమయంలో 50 వేల రూపాయల వరకూ రాయితీని 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అందచేస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు 

New Update
Scrap Vehicles: పనికిరాని పాతకారు ఇచ్చేయండి.. 50 వేలు పట్టేయండి!!

దేశంలోని 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాత కార్ల(Scrap Vehicles) విషయంలో పెద్ద ప్రకటన చేశాయి. ఎవరైనా తన పాత కారును స్క్రాప్‌గా ఇస్తే, వారికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త కారుపై రాయితీ ఇస్తుంది. వాస్తవానికి, తమ తమ రాష్ట్రాల్లో పాత -అనర్హమైన వాహనాలను తప్పనిసరిగా స్క్రాపింగ్ (Scrap Vehicles)చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఆ తర్వాత బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ - కేరళతో సహా 21 రాష్ట్రాలు,  కేంద్ర పాలిత ప్రాంతాలు మోటారు వాహనాలు లేదా రోడ్ టాక్స్ లో మినహాయింపును ప్రకటించాయి.

ఏ వాహనానికి ఎంత తగ్గింపు?
రాష్ట్ర- కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు పాత వాహనాలను స్క్రాప్(Scrap Vehicles) చేయడానికి బదులుగా కొత్త కారు కొనుగోలుపై 25 శాతం వరకు తగ్గింపు అలాగే, వాణిజ్య వాహనాలపై 15 శాతం వరకు తగ్గింపును అందిస్తాయి. ఇప్పటి వరకు దాదాపు 70,000 పాత వాహనాలు ఆటోమేటిక్‌గా ధ్వంసమయ్యాయి. అయినప్పటికీ, వాటిలో ఎక్కువ భాగం కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు చెందినవే ఉన్నాయి. 10 -15 సంవత్సరాల కంటే పాత డీజిల్-పెట్రోల్ వాహనాలు(Scrap Vehicles) ఆటోమేటిక్‌గా రిజిస్టర్ అవడానికి అవకాశం లేని ఆలాగే,  రద్దు చేయాల్సిన ఏకైక రాష్ట్రం/UT ఢిల్లీ మాత్రమే.

Also Read:  బీమా విస్తార్..ఇది ఆల్ ఇన్ వన్ సూపర్ సేవర్ ఇన్సూరెన్స్ బాస్! 

ఏయే రాష్ట్రాల్లో.. ఎంత..ఎలాంటి మినహాయింపు?
మీడియా నివేదికల ప్రకారం, పాత వాహనాల(Scrap Vehicles)ను తొలగించిన తర్వాత రిజిస్ట్రేషన్ సమయంలో వాణిజ్య లేదా రవాణా వాహనాలకు 15 శాతం రోడ్డు పన్ను రాయితీ ఇస్తామని  21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 17 పేర్కొన్నాయి. ప్రైవేట్ వాహనాల విషయంలో, 12 రాష్ట్రాలు రోడ్డు పన్నులో 25 శాతం తగ్గింపు ఇస్తున్నాయి. హర్యానా స్క్రాప్ విలువలో 10 శాతం లేదా 50 శాతం కంటే తక్కువ రాయితీని అందిస్తోంది. మరోవైపు, ఉత్తరాఖండ్ 25 శాతం లేదా రూ. 50,000 ఏది తక్కువైతే అది డిస్కౌంట్ ఇస్తోంది. కొత్త వాహనం ధరకు అనుగుణంగా రోడ్డు పన్నులో నిర్ణీత రాయితీని కర్ణాటక అందిస్తోంది. ఉదాహరణకు రూ.20 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న కారుపై రూ.50,000 తగ్గింపు లభిస్తుంది. పుదుచ్చేరిలో, 25 శాతం తగ్గింపు లేదా రూ. 11,000, ఏది తక్కువైతే అది అందుబాటులో ఉంటుంది.

ఎన్ని రాష్ట్రాల్లో రద్దు కేంద్రాలు?
ప్రభుత్వం స్వచ్ఛంద వాహనాల స్క్రాపింగ్‌(Scrap Vehicles)ను ప్రోత్సహించినప్పటి నుండి, 37 రిజిస్టర్డ్ స్క్రాపింగ్ కేంద్రాలు లేదా RVSFలు పని చేస్తున్నాయని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 52 కేంద్రాలు పనిచేస్తున్నాయి. అదేవిధంగా, వాహనాల ఫిట్‌నెస్‌ను తనిఖీ చేయడానికి 11 రాష్ట్రాలు- కేంద్రపాలిత ప్రాంతాలలో 52 ఆటోమేటిక్ పరీక్షా కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఆర్‌విఎస్‌ఎఫ్, ఎటిఎస్‌ల సంఖ్యను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించామని, తద్వారా ప్రజలు వాటిని సులభంగా చేరుకోవచ్చని మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు