కోడి ముందా? గుడ్డు ముందా? సమాధానం దొరికిందోచ్..!!

కోడి ముందా? గుడ్డు ముందా? అంటే ఇన్నాళ్లు మన దగ్గర సమాధానం లేదు. కానీ, బ్రిస్టల్ యూనివర్సిటీ దీనికి ఆన్సర్ చెప్పేసింది. తాజా అధ్యయనంలో కోడే ముందని తేలిపోయింది. సరీసృపాలు, పక్షులు, క్షీరదలు మొదట గుడ్లు పెట్టడానికి బదులుగా పిల్లలకు జన్మనిచ్చాయని పరిశోధకులు తేల్చారు. 51 శిలాజ జాతులు, 29 జీవ జాతులపై ఈ అధ్యయనం చేశారు.

కోడి ముందా? గుడ్డు ముందా? సమాధానం దొరికిందోచ్..!!
New Update

ఎందుకంటే కోడి ముందా గుడ్డు ముందా.. విత్తు ముందా చెట్టు ముందా అనే సామెత మనం సాధారణంగా వాడుతూనే ఉంటాం. . దీని చుట్టూ వేదాంతం కూడా చెబుతూ ఉంటాం కానీ శాస్త్రవేత్తలు మాత్రం వేదాంతం పక్కనపెట్టి శాస్త్రీయంగా నిరూపించే పనిలో పడ్డారు. బ్రిస్టల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కొందరు ఈ విషయం కాస్త సీరియస్ గానే తీసుకున్నారు. అందుకే వారి జీవపరిణామ క్రమంలో అసలు గుడ్డు పెట్టే ప్రక్రియ జంతువుల్లో ఎప్పుడు ప్రారంభమైంది అన్న దానిపై పరిశోధన చేశారు. జీవరాసులు మొదట అణువంత రూపంలో ఉన్నాయి. అప్పుడు వాటి పునరుత్పత్తి ప్రక్రియ. రెండుగా విడిపోవడం తో మొదలయ్యేది. సూక్ష్మజీవులు పరిణామ క్రమంలో పెద్ద జీవులుగా మారేటప్పటికీ వాటి పునరుత్పత్తి ప్రక్రియ మారిపోయింది. స్త్రీ పురుష కలయిక వల్ల పునరుత్పత్తి జరగడం ప్రారంభమైంది.

Scientists have found the answer to the question

ఈ క్రమంలోనే కోడి ముందా పుట్టిందా..లేక గుడ్డు ముందా .అన్న చిక్కు ప్రశ్నకు పరిశోధకులకు సమాధానం దొరికింది. పరిశోధనల్లో కోడే ముందు పుట్టిందని శాస్త్రీయంగా కనుగొన్నారు. జీవరాశులు పరిణామ క్రమంలో ముందుగా గుడ్లు పెట్టడానికి బదులు నేరుగా గర్భంలోనే పిల్లలను జన్మనిచ్చేవని తెలిపారు. ఆ తరువాత జీవ పరిణామం లో భాగంగా క్రమంగా కొన్ని జాతుల్లో గర్భంలోని అండం అండం బయటకు రావడం జరిగిందని అది నీటిలో పెరిగే సరిసృపాలు, గాలిలో ఎగిరే పక్షుల్లో క్రమంగా అభివృద్ధి చెందిందని శాస్త్రవేత్తలు తెలిపారు. మొత్తం 51 శిలాజ జాతులను గుర్తించగా అందులో, 29 జీవజాతులను గుడ్లు పెట్టేవని పేర్కొన్నారు..బ్రిస్టల్‌ వర్సిటీ పరిశోధకులు అధ్యయనంలో ఈ విషయం తేలింది. మొదట్లో చాలా జాతులు పునరుత్పత్తికి నీటిపైనే ఆధారపడేవని గుర్తించారు. పరిస్థితులు అనువుగా మారేవరకూ అవి తమ పిల్లలను గర్భంలోనే దాచుకొనేవని, నెమ్మదిగా అవి గుడ్లను పెట్టడం ప్రారంభించాయని పేర్కొన్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe