TG, AP School Holidays: విద్యార్థులకు అలెర్ట్.. నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు!

రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలక్రమంలో పలు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.ఏపీలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ,అలాగే తెలంగాణలోని నిర్మల్, ఖమ్మం , కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో సెలవు ప్రకటించారు.

New Update
Telangana: రేపటి నుంచే తెలంగాణలో బడులు ప్రారంభం

TG, AP School Holidays: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా విస్తారంగా వర్షాలు కురుస్తునే ఉన్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఈ క్రమంలోనే నేడు కూడా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఈ క్రమంలో ఏపీలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, జిల్లాల్లో కలెక్టర్లు మంగళవారం కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.అదే విధంగా తెలంగాణలోని వరద ప్రభావం ఉన్న జిల్లాల్లో పరిస్థితుల దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడం పై ఆ జిల్లా కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వర్ష ప్రభావం ఉన్న నిర్మల్, ఖమ్మం , కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని స్కూళ్లకు, కాలేజీలకు ఆ జిల్లాల కలెక్టర్లు సెలవు ప్రకటించారు.

Also Read:  చంద్రబాబు సర్కార్‌ రెస్క్యూ ఆపరేషన్ చేపడుతోంది… రేవంత్ ప్రభుత్వం చేసింది జీరో

Advertisment
Advertisment
తాజా కథనాలు