Srikakulam: శ్రీకాకుళం జిల్లా గార మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ లో అసలేం జరగుతుంది. 7కిలోల బంగారం మాయం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సిబ్బందిపైనే అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఖాతాదారుల బంగారు ఆభరణాలను వేరే బ్యాంకుల్లో పెట్టి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గార బ్రాంచ్‌లో మాయమైన 7కిలోల బంగారు ఆభరణాలు విలువ రూ.5కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Also read: వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం.. కాకినాడ సముద్ర తీరంలో ఏం జరిగిందంటే.?
శ్రీకాకుళం ప్రాంతీయ అధికారి టీఆర్‌ఎం రాజు బ్యాంకుకు చేరుకుని, ఆడిట్ కారణంగా ఆలస్యమవుతోందని.. బంగారం మాయమైందనే వదంతులు నమ్మవద్దని చెప్పారు. డిసెంబరు 8 వరకు వేచి ఉంటే ఆభరణాలకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఇంతలో బ్యాంకులో బంగారంపై రుణాలిచ్చే బాధ్యతలు చూసే డిప్యూటీ మేనేజరు ఉరిటి స్వప్నప్రియ నవంబరు 29న ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు ఇంటి దగ్గర చికిత్స చేయిస్తూ వచ్చారు.
Also read: అలెర్ట్.. తుపాను ముప్పు.. ఏపీ, తెలంగాణకు వర్షాలు!
ఇంతలో ఆమె ఆరోగ్యం కుదుటపడుతుందనుకునేలోగా సోమవారం సాయంత్రం మరింత క్షీణించడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిస్థితి తీవ్రంగా ఉందని చెప్పడంతో విశాఖకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం చనిపోయారు. ఈమె తల్లితో కలసి నగరంలోని పీఎన్ కాలనీలో ఉంటున్నారు. సోదరుడు కూడా ఎస్‌బీఐలోనే రిలేషన్‌షిప్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. మనస్తాపంతో స్వప్నప్రియ ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లి శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.