Home Loans: ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల హోమ్ లోన్ రేట్లను 8.45 శాతం నుంచి 8.3 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెలాఖరు వరకు పరిమిత కాలానికి ప్రాసెసింగ్ ఫీజులను కూడా బ్యాంక్ పూర్తిగా మాఫీ చేసింది. అతి తక్కువ ధరకే 8.3 శాతం రుణాలను అందజేస్తున్నట్లు బ్యాంకు పేర్కొంది. SBI తో పాటు HDFC బ్యాంకు కూడా 8.4 శాతం ప్రారంభ రేటుతో హోమ్ లోన్స్(Home Loans) అందిస్తోంది. ఈ ఆఫర్ మార్చి 31 వరకు చెల్లుబాటులో ఉంటుందని ఆ బ్యాంకులు పేర్కొన్నాయి.
ప్రాసెసింగ్ ఫీజు లేదు
రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్‌పై 7 శాతం వడ్డీ రేటును అందిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది. దీనిపై ప్రాసెసింగ్ ఫీజు కూడా వసూలు చేయడం లేదు. 8.3 శాతం వద్ద, 30 సంవత్సరాల కాలవ్యవధికి రూ. 1 లక్ష హోమ్ లోన్(Home Loans) కోసం ప్రారంభ EMI నెలకు రూ. 755 అవుతుంది.
ఎక్కువ సొమ్ము తీసుకునే సౌకర్యం
ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయంతో గృహ కొనుగోలుదారులకు రుణ ప్యాకేజీ(Home Loans)ని మరింత పెంచామని HDFC తెలిపింది. గృహ నిర్మాణం, రెన్నొవేషన్, ఫర్నీచర్ కవర్ కాకుండా.. దాని హోమ్ లోన్ ఆఫర్ సాంప్రదాయ ఫైనాన్సింగ్‌కు మించి స్వచ్ఛమైన.. పునరుత్పాదక ఇంధన పరిష్కారాలను ప్రోత్సహించడానికి దాని పరిధిని విస్తృతం చేస్తుంది. హోమ్ లోన్స్(Home Loans)కు వర్తించే అదే వడ్డీ రేటుతో ఈ లోన్స్ ఇస్తారు. సోలార్ ప్యానెల్ ఇన్‌స్టాలేషన్ కోసం రూ. 10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది.
Also Read: గ్రాట్యుటీ ఎవరికి వస్తుంది? దాని నిబంధనలు తెలుసా?
గరిష్ట రీపేమెంట్ వ్యవధి
రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్ లోన్ రేటు 7 శాతం. దీనికి ప్రాసెసింగ్ ఫీజు లేదు. ఈ పథకం కింద, సోలార్ రూఫ్‌టాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలనే లక్ష్యంతో ఉన్న వ్యక్తులు గరిష్టంగా 120 నెలల రీపేమెంట్ వ్యవధితో ప్రాజెక్ట్ వ్యయంలో 95 శాతం వరకు ఫైనాన్స్ పొందవచ్చు. ఒక వినియోగదారుడు నేరుగా క్లెయిమ్ చేయగల రూ. 78,000 వరకు ప్రభుత్వ సబ్సిడీని కూడా పొందవచ్చని HDFC బ్యాంక్ తెలిపింది.