శనివారం నాడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి!

శనివారం నాడు మద్యం తాగడం, మాంసం తినడం వల్ల శనిదేవుని ఆగ్రహానికి గురవుతారని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా గోర్లు, జుట్టు కత్తిరించడం వంటి పనులు శనివారం నాడు చేయకూడదని వివరిస్తున్నారు.

శనివారం నాడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి!
New Update

శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఎంతలా పూజిస్తారో..అలాగే శనీశ్వరునికి కూడా ప్రత్యేక పూజలు చేస్తారనే విషయం తెలిసిందే. జీవితంలో శని చెడు దృష్టితో చూస్తే మాత్రం చాలా సమస్యలను ఎదుర్కొంటామని, డబ్బు సమస్యలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు. శనివారం నాడు కొందరు ఆంజనేయుణ్ణి, పరమేశ్వరున్ని కూడా పూజిస్తారు.

శనివారం నాడు గుడికి వెళ్లి శని దేవుడిని పూజించడం వల్ల డబ్బు సమస్యలు తీరాతాయని పండితులు వివరిస్తున్నారు. శనివారం రోజు శని దేవునికి నువ్వులను నైవేద్యంగా సమర్పించడం వల్ల అనేక బాధల నుంచి విముక్తి లభిస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. అయితే శనివారం నాడు ఈ తప్పులు చేయడం వల్ల శనీశ్వరునికి చాలా కోపం వస్తుందట.

అవేంటో ఓ సారి తెలుసుకుందాం... ఈరోజున బొగ్గు, ఉప్పు, తోలు, బూట్లు, నల్ల నువ్వులు, మినప పప్పు, చీపురు, నూనె, కలప, ఇనుము లేదా ఇనుప వస్తువులను కొనుగోలు చేయకూడదు. మాంసం , మద్యం సేవించడం చాలా అశుభం. ఇలా చేస్తే శనీశ్వరునికి కోపం వచ్చి శిక్షిస్తాడని పెద్దలు చెబుతున్నారు.

అంతే కాకుండా పురుషులు శనివారం పూట అత్తమామల ఇంటికి వెళ్లకూడదని చెబుతారు. అలా వెళ్తే వారితో సంబంధాలు చెడిపోతాయని అంతేకాకుండా భార్యభర్తల మధ్య సంబంధాలు కూడా తెగిపోయే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే శనివారం నాడు జుట్టు, గోర్లు కత్తిరించకూడదు. ఇలా చేయడం వల్ల శనీ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.

అలాగే పాలు, పెరుగు కూడా తినకూడదని ఓ మాట. ఒకవేళ తాగాల్సి వస్తే బెల్లం కలుపుకోని తాగాలి. శనివారం బెండకాయ, మామిడికాయ పచ్చడి, పండు మిరపకాయలు తినకుండా ఉండాలి..

అలాగే ఈరోజున పొరపాటున కూడా ఎవరిని అవమానించకూడదు. అదే విధంగా తూర్పు, దక్షిణ, ఈశాన్య వైపు ప్రయాణించకుండా ఉండాలి. ఇలా ప్రయాణం చేయడం ద్వారా మీరు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది… ఈరోజు నల్ల నువ్వులు, ఉలవలు దానం ఇవ్వాలి.. ఇలా చెయ్యడం వల్ల శని భాధల నుంచి విముక్తి కలుగుతుంది.

Also read: పాతబస్తీలో ఐటీ దాడులు..బడా వ్యాపారులే టార్గెట్‌!

#saturday #sanidevudu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe