Ananthapuram: సచివాలయ సిబ్బందిపై వైసీపీ నాయకుడి దాడి.. ఫర్నిచర్ ధ్వంసం చేసి రచ్చ.. రచ్చ..!

సత్యసాయి జిల్లాలో లోచర్ల సచివాలయ సిబ్బందిపై చెప్పుతో దాడికి యత్నించాడు సర్పంచ్ కుమారుడు. సర్పంచ్ వస్తే కనీస గౌరవం ఇవ్వరా అంటూ ఫర్నిచర్ ధ్వంసం చేసి నానా బీభత్సం సృష్టించినట్లు తెలుస్తోంది.

New Update
Ananthapuram: సచివాలయ సిబ్బందిపై వైసీపీ నాయకుడి దాడి.. ఫర్నిచర్ ధ్వంసం చేసి రచ్చ.. రచ్చ..!

Attack on Secretariat Staff:  శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలంలో వైసీపీ నాయకుల (YCP Leaders) వికృత చేష్టలు పరాకాష్ట స్థాయికి చేరాయి. లోచర్ల సచివాలయ సిబ్బందిపై వైసీపీ నాయకుడు దాడి చేశాడు. సర్పంచ్ అయిన తల్లి గంగమ్మకి అధికారులు కనీస గౌరవం ఇవ్వలేదని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి (MLA Sridhar Reddy) అనుచరుడు నారాయణస్వామి ఏకంగా రెవిన్యూ సిబ్బందిపై చెప్పుతో దాడికి ప్రయత్నించి ఫర్నిచర్ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది.  రెవిన్యూ అధికారుల గుండెల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

Also Read:  ఏపీలో రైతుల పరిస్థితి ఇదే..వైసీపీ ప్రభుత్వంపై షర్మిల విమర్శలు..!

జగనన్న లేఔట్ లో హౌసింగ్ కాలనీ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. లబ్ధిదారుల నుంచి రెవిన్యూ సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సమాచారంతో రెవిన్యూ ఇన్స్పెక్టర్ దుర్గేష్ వీఆర్వో సచివాలయ సిబ్బందితో మాట్లాడడానికి తల్లి గంగమ్మను (Gangamma) తీసుకుని నారాయణస్వామి సచివాలయానికి వెళ్ళాడు. సర్పంచి వచ్చిన మీరు కనీస గౌరవం ఇవ్వరా? అంటూ కోపోద్రిక్తుడై చెప్పుతో సిబ్బందిపై దాడికి ప్రయత్నించాడని.. ఫర్నిచర్ ధ్వంసం చేసి నానా బీభత్సం సృష్టించారని వార్తలు వినిపిస్తున్నాయి. నానా బూతులు తిడుతూ రభస సృష్టించాడని.. చంపుతానని బెదిరించారని సిబ్బంది ఆరోపిస్తున్నారు.

Also Read: నో డౌట్.. ఈ రెండో యాత్ర సినిమా వైసీపీకి బూస్టర్ డోస్

వైసీపీ (YCP) నాయకుల తీరుతో సిబ్బంది బెంబేలెత్తారు. అక్కడే ఉన్న సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి నారాయణస్వామిని బయటికి పంపారు. అనంతరం నారాయణస్వామి మాట్లాడుతూ.. రెవిన్యూ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారాయని ఆరోపించాడు. ప్లాట్ ఇవ్వాలన్న రిజిస్ట్రేషన్ చేయాలన్న, హౌసింగ్ కేటాయించాలన్న సిమెంట్ ఇవ్వాలన్నా డబ్బులు ఇవ్వనిదే ఏ పని జరగడం లేదని అధికారులపై దుమ్మెత్తి పోశారు. ఏది ఏమైనా భౌతిక దాడులకు దిగడం అందరినీ కలవర పాటకు గురిచేస్తోంది.

Advertisment
తాజా కథనాలు