Sarpanch Protest: ఇలా చేస్తేనే మనకు న్యాయం జరుగుతుంది: సర్పంచుల సంఘం

అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట సర్పంచులు ధర్నా చేపట్టారు. ప్రభ్వుతం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పంచాయితీలకు నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని పెద్ద ఎత్తున సర్పంచులు నినాదాలు చేశారు.

New Update
Sarpanch Protest: ఇలా చేస్తేనే మనకు న్యాయం జరుగుతుంది: సర్పంచుల సంఘం

Sarpanch Protest: సీఎం జగన్‌ ఇంటికి వెళ్తేనే గ్రామ పంచాయతీలకు న్యాయం జరుగుతుందని సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ నేతలు అన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరతూ అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట సర్పంచులు ధర్నా నిర్వహించారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.

Also Read: పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లిన పెళ్లి కొడుకు.. ఇంతలోనే..!

రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీలకు తీరని ద్రోహం చేసిందని పంచాయతీరాజ్ ఛాంబర్ చైర్మన్ బీవీ. రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోగా, గ్రామాలు శిథిలమై పోతున్నాయని మండిపడ్డారు. గల్లీ నుంచి దిల్లీ వరకు ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వం స్పందించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు.

Also Read: జగన్ సర్కార్ కు షాక్.. ఆరోగ్య శ్రీ సేవలు బంద్..!

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పల్లెల నుంచి పట్టణాలకు వలసలు ఎక్కువగా పెరిగిపోతున్నాయని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీలకు నిధులు ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు. గ్రామీణ అభివృద్ధిని జగన్​కు ఏ మాత్రం పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్​ల అధికారాలను తొలగించి సచివాలయాలకు ఇవ్వడమనేది రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకమని దుయ్యబట్టారు.

Advertisment
తాజా కథనాలు