Festival Offers: సంక్రాంతి స్పెషల్ ఆఫర్..ఈ స్కూటర్ పై భారీ డిస్కౌంట్.. సింగిల్ ఛార్జ్ తో 120 కి.మీ జర్నీ!

ఫ్రాంక్లిన్ ఈవీ పవర్ ప్లేస్ కేవలం 95వేల నుంచి లక్షా 10వేల మధ్యలో లభిస్తుంది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 120 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. డిస్క్ బ్రేక్, లాంగ్ లెగ్ రూమ్ ఫీచర్లు ప్రత్యేకం. సంక్రాంతికి కొత్తగా ఈవీ కొనాలనుకునేవారికి ఈ స్కూటర్ మంచి ఎంపిక.

Festival Offers: సంక్రాంతి స్పెషల్ ఆఫర్..ఈ స్కూటర్ పై భారీ డిస్కౌంట్.. సింగిల్ ఛార్జ్ తో 120 కి.మీ జర్నీ!
New Update

Festival Offers: భారత మార్కెట్లో ఈవీలు ఆదిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రజలు కూడా వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే కస్టమర్లకు నచ్చినట్లుగా కంపెనీలు ప్రత్యేక ఫీచర్లతో ఈవీలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అయితే మీరు సంక్రాంతికి స్కూటర్(Scooter) ను కొనుగోలు చేయాలనుకుంటే మీకో బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఫ్రాంక్లిన్ ఇవి (Franklin Evie)పవర్ ప్లేస్. కేవలం 95 వేల నుంచి లక్షా 10వేల మధ్యలో లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకత గురించి చెప్పుకుంటే ఈ స్కూటర్ ను ఒకసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

అయితే దీని యొక్క ఛార్జింగ్ సమయం మాత్రం 5గంటలు మాత్రమే. 0 నుంచి 40కిలోమీటర్ల స్పీడ్ కేవలం 5 సెకండ్ల లోపే అందుకుంటుంది. ఈ స్కూటర్ కు డిస్క్ బ్రేక్, లాంగ్ లెగ్ రూమ్ ఫీచర్స్ ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఐదు రంగులు అందుబాటులో ఉన్నాయి. అవి బ్లూ, జెట్ బ్లాక్, పోస్ట్ వైట్, మెరూన్, గోల్డ్ కలర్స్ ఉన్నాయి.

ఇది కూడా చదవండి: జనవరి 15 నుంచి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్..అదిరే ఆఫర్లు..కళ్లుచెదిరే డిస్కౌంట్లు..ఆ ఫోన్లపై భారీ డీల్స్..!!

ఫ్రాంక్లిన్ ఈవీ పవర్ ప్లేస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కు చాలా స్పెషాలిటీ ఉంది. ఈ స్కూటర్ జీరో నుంచి 40 కిలోమీటర్ల వరకు 5 సెకండ్లలోనే వెళ్తుంది. అయితే ఇలాంటి స్పీడ్ ఉన్న బైక్ కు బ్రేక్స్ బాగా పనిచేయడం చాలా అవసరం. అయితే ఫ్రాంక్లిన్ ఇవి డిస్క్ బ్రేక్ ఉండటం వల్ల ఆ బైకు ఎంత స్పీడ్ లో ఉన్నా కంట్రోల్ చేసే అవకాశం దొరుకుతుంది. ఫ్రాంక్లిన్ ఏవి పవర్ ప్లేస్ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 55 కిలోమీటర్లు వెళ్తుంది.

#festival-offers
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe