AP : ఏపీ విద్యార్థులకు శుభవార్త.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన జగన్ సర్కార్.. తేదీలివే!

ఏపీ ప్రభుత్వం సంక్రాంతి సెలవుల తేదీలను ప్రకటించింది. ఈ నెల 9 నుంచి 18 వరకు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఉంటాయని ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆయా విద్యార్థులకు మొత్తం 10 రోజుల పాటు సంక్రాంతి సెలవులు లభించనున్నాయి.

New Update
AP : ఏపీ విద్యార్థులకు శుభవార్త.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన జగన్ సర్కార్.. తేదీలివే!

AP Sankranti Holidays : మరో రెండు రోజుల్లో ఏపీలో సంక్రాంతి(Sankranti) సంబరాలు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ(AP) విద్యార్థులకు ఏపీ గవర్నమెంట్‌ ఓ గుడ్‌ న్యూస్‌ తెలిపింది. అది ఏంటంటే సంక్రాంతి సెలవులు(Holidays) ఎప్పటి నుంచి ఎప్పటి వరకో తెలిపింది. జనవరి 9 నుంచి 18 వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది.

సెలవులు ఎప్పటి నుంచి అంటే..

ఈ సారి జనవరి 13న రెండో శనివారం, జనవరి 14 ఆదివారం భోగి పండుగ, జనవరి 15 సోమవారం సంక్రాంతి(Sankranti) పండుగ రాగా.. 18 వరకు సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. ముందు జనవరి 16 మంగళవారం వరకే సెలవులు ఉంటాయని భావించిన పాఠశాల, కళాశాల యజమాన్యాలు మరో రెండు రోజుల పాటు అదనంగా సెలవులు ప్రకటించింది.

Also read: అర్జున్‌ రెడ్డి సినిమా బన్నీతో చేద్దామానుకున్నా..కానీ విజయ్ తో !

ప్రభుత్వ , ప్రైవేట్‌ స్కూళ్లు అన్నింటికి కూడా అకాడమిక్‌ క్యాలెండర్(Academic Calendar) ప్రకారం సెలవులు ప్రకటించాలని విద్యాశాఖాధికారులు అన్ని పాఠశాలల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. సెలవుల సమయంలో కానీ పాఠశాలలు కానీ ప్రత్యేక తరగతలు కానీ నిర్వహిస్తే కథిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ప్రత్యేక బస్సులు, రైళ్లు..

ఈ నెలలో మొత్తం 10 రోజుల సెలవులు వచ్చినట్లు తెలుస్తుంది. ఇటు తెలంగాణలో కూడా సంక్రాంతి సెలవులను 9 నుంచి 16 వ తేదీ వరకు సెలవులు ప్రకటించడంతో ఉద్యోగాల రీత్యా తెలంగాణలో ఉంటున్న వారు ఇప్పటికే సొంతూర్లకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే టీఎస్‌ ఆర్టీసీ(TSRTC) తో పాటు..సౌత్‌ సెంట్రల్‌ రైల్వే(South Central Railway) కూడా ప్రత్యేక బస్సులు, రైళ్లను ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisment
తాజా కథనాలు