Sankranthi Special: సంక్రాంతి పండగ అనగానే ఇంటింటా సంబరాలు మొదలవుతాయి. ముఖ్యంగా ఈ పండగ అంటే ఆడపిల్లలకు మరింత ఇష్టం. సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేవి రంగ వల్లులు, కోడి పందేలు, భోగి మంటలు, గొబ్బెమ్మలు. ప్రతీ ఇంటి ముందు అందమైన రంగవల్లులు కనువిందు చేస్తుంటాయి. పెద్ద పెద్ద ముగ్గులు వేసి వాటి మధ్యలో అందమైన గొబ్బెమ్మలు పెడతారు. ఇది పూర్వ కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. అసలు సంక్రాంతి అంటే ఇంటి ముందు రంగవల్లులు, గొబ్బెమ్మలు పెట్టడానికి కారణమేంటో తెలుసా..?
ఇంటి ముందు రంగవల్లులు ఎందుకు వేస్తారు
రంగోలి అనేది సాంప్రదాయ భారతీయ కళారూపం. సంక్రాంతి పండగ రోజు ఇంటి ముందు రంగవల్లులు వేయడం వెనుక ఖచ్చితమైన శాస్త్రీయ కారమేమి లేదు. అతిథులను స్వాగతిస్తూ.. వారి వెంట అదృష్టాన్ని తీసుకురావాలని ఆశీస్తూ శుభదాయకంగా ఇంటి ముందు రంగవల్లులు వేస్తారు. కొన్ని నమ్మకాల ప్రకారం రంగులు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి.. దుష్ప్రభావాలను దూరం చేస్తాయని భావిస్తారు. అలాగే కొత్త సంవత్సరంలో అడుగుపెదుతున్న వేళ.. ఈ రంగవల్లులు జీవితంలో పాజిటివిటీనీ కలిగిస్తాయని విశ్వాసం. సంక్రాంతికి రంగాలు వేయడం వెనుక శాస్త్రీయ కారణాల కంటే సంస్కృతి, సాంప్రదాయ విశ్వాసాలు ఎక్కువగా ఉన్నాయి.
Also Read: Tea In Paper Cups: పేపర్ కప్పులో టీ తాగితే ఇంత ప్రమాదమా..! అస్సలు లైట్ తీసుకోకండి
గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు
సంక్రాంతి పండగ రోజు.. ఇంటి ముందు ఆవు పేడతో కళ్ళాపి చల్లి రంగు రంగుల ముగ్గులు వేసి వాటి మధ్యలో అందమైన గొబ్బెమ్మలు పెడతారు.
ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలను ముగ్గు మధ్యలో పెట్టి వాటిలో నవ ధాన్యాలు వేసి.. పూలతో అలంకరించి పూజిస్తారు. ఇది పూర్వ కాలం నుంచి సాంప్రదాయంగా వస్తున్న పద్ధతి. ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టడం వెనుక శాస్త్రీయ కారణంతో పాటు సాంప్రదాయ ఆధారాలు కూడా ఉన్నాయి.
శాస్త్రీయ కారణం
ఆవు పేడలో యాంటీ బియోటిక్ లక్షణాలు ఉంటాయి. ఇంటి ముందు ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెడితే ఇంట్లోకి సీక్ష్మ క్రిములు రాకుండా కాపాడుతుంది. అందుకే ఇంటి ముందు ఆవు పేడతో కళ్ళాపి చల్లడం చల్లుతారు.
ఆధ్యాత్మిక ఆధారాలు
కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే గొబ్బెమ్మలు. ముగ్గు మధ్యలో ఉండే పెద్ద గొబ్బెమ్మను గోదాదేవికి సంకేతంగా భావిస్తారు. హిందూ సాంప్రదాయంలో ఆవును గౌరీ మాతగా పూజిస్తారు. కొత్త ఏడాది సిరి సంపదలు, సుఖ సంతోషాలు కలగాలని పవిత్రమైన ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ఇంటి ముందు పెట్టి పూజిస్తారు. పెళ్లికాని అమ్మాయిలు వీటిని చేసి పూజిస్తే కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తారని నమ్ముతారు. గోపికలకు కృష్ణిడి పై ఉన్న భక్తి తమకు రావాలని ఆశిస్తూ గొబ్బెమ్మలను పెడతారు.
Also Read: Eating Banana: ఉదయాన్నే బనానా తింటున్నారా.. అయితే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు..!