Srisailam : శ్రీశైలం వెళ్లే ప్లాన్ లో ఉన్నారా?మీకు శుభావార్త..ఏంటంటే..?

సంక్రాంతి బ్రహోత్సవాల సందర్భంగా రుద్రహోమం, స్వామి అమ్మవార్ల కళ్యాణం, చండీహోం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం రద్దు చేసినట్లు అలయ నిర్వహకులు తెలిపారు. నేటి నుంచి ధ్వజారోహణంతో కార్యక్రమాలు షురూ అయ్యాయి. రేపటి నుంచి స్వామి అమ్మవార్ల సేవలు ఉంటాయి.

Srisailam: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ..భక్త జనసంద్రంగా మారిన శ్రీశైలం..!
New Update

Srisailam: శ్రీశైలం ...ద్వాదశ జోతిర్లింగాలలో ఒకటి. పవిత్ర భారతదేశంలో ద్వాదశ జోతిర్లింగాల్లో రెండవది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పవిత్ర క్షేత్రం. దట్టమైన నల్లమల్ల అడవి ప్రాంతంలో సముద్ర మట్టానికి 500 అడుగుల ఎత్తులో కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం. ఈ ఆలయంలో సాక్షాత్తు ఆ పరమశివుడే స్వయంబుగా వెలిసారని..ఇది మరో భూకైలాసం అని భక్తులు నమ్ముతుంటారు. మనిషి జీవితానికి మోక్షం కలిగించే కాశీ పుణ్యక్షేత్రం అంతటి విశిష్టత గంగా నదిలో 5వేల సార్లు మునిగితే వచ్చేంత పుణ్యఫలం శ్రీశైల క్షేత్ర దర్శనం అని నమ్మకం. అలాంటి మహా పుణ్యక్షేత్రంలో కొత్త ఏడాది సంక్రాంతి(Sankranti) సంబురాలు కన్నులపండువగా జరగనున్నాయి.

సంక్రాంతి బ్రహోత్సవా(Sankranti Bramhostavalu)ల సందర్భంగా రుద్రహోమం, స్వామి అమ్మవార్ల కళ్యాణం, చండీహోం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం రద్దు చేసినట్లు అలయ నిర్వహకులు తెలిపారు. నేటి నుంచి ధ్వజారోహణంతో కార్యక్రమాలు షురూ అయ్యాయి. రేపటి నుంచి స్వామి అమ్మవార్ల సేవలు ఉంటాయి.

13 వ తేదీన భృంగివాహన వాహన సేవ, బ్రహ్మోత్సవ కళ్యాణం.

16వ తేదీన కై లాస వాహన సేవ 17.1.2024. పూర్ణాహుతి, త్రిశూలస్నానం, సదస్యం,నాగవల్లి, ధ్వజావరోహణ.

18వ తేదీన అశ్వవాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవంతో బ్రహ్మోత్సవాలు ఉంటాయి.

18వ తేదీలో స్వామిఅమ్మవార్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఇక సంక్రాంతి సందర్బంగా శ్రీశైలానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని ఆలయ ఈఓడి పెద్దిరాజు తెలిపారు.

ఇది కూడా చదవండి: రేషన్ కార్డ్ ఉందా?అయితే మీకో గుడ్ న్యూస్..అందులో ఉచితంగానే..!!

#srisailam #sankranti-celebrations #bramhostavalu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe