కేవలం ఆమె అందం వల్లే రాజ్యసభకు! మహారాష్ట్ర రాజకీయాలు గత కొంత కాలం నుంచి వార్తల్లో నిలుస్తున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయిన తరువాత నుంచి కూడా ఒక వర్గం మీద మరొక వర్గం నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఉద్దవ్ ఠాక్రే వర్గాన్ని టార్గెట్ చేసుకొని మరి కొన్ని రోజుల నుంచి ఏక్ నాథ్ వర్గం విమర్శలు గుప్పిస్తుంది. By Bhavana 31 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి మహారాష్ట్ర రాజకీయాలు గత కొంత కాలం నుంచి వార్తల్లో నిలుస్తున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయిన తరువాత నుంచి కూడా ఒక వర్గం మీద మరొక వర్గం నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఉద్దవ్ ఠాక్రే వర్గాన్ని టార్గెట్ చేసుకొని మరి కొన్ని రోజుల నుంచి ఏక్ నాథ్ వర్గం విమర్శలు గుప్పిస్తుంది. ఈ క్రమంలోనే సోమవారం ఏక్ నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యే సంజయ్ శిర్సత్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేవలం ఉద్దవ్ వర్గంలో ఉన్న ఓ మహిళ ఎమ్మెల్యే గురించి ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉద్దవ్ వర్గంలో ప్రియాంక చతుర్వేది అని ఓ మహిళా ఎమ్మెల్యే ఉన్నారు. ఆమెను ఉద్దేశించి కేవలం ప్రియాంక అందం చూసి మాత్రమే ఆదిత్య ఠాక్రే ఆమెను రాజ్యసభకు పంపారే తప్ప..ఆమె ప్రజలకు మేలు చేస్తుందన్న ఉద్దేశంతో కాదు. ఉద్దవ్ వర్గంలో ఎంతో మంది కష్టపడి పని చేసే కార్యకర్తలు ఉన్నారు. కానీ ఆదిత్య కేవలం ఆమె అందానికి పడి పోయి ఆమెను రాజ్యసభకు పంపించారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మనకి ఎందుకు వచ్చిన గొడవ అనుకున్న శిర్సత్ వెంటనే మాట మార్చేశారు. ఉద్దవ్ వర్గానికి చెందిన మాజీ ఎంపీ చంద్రకాంత్ ఖైరే నాతో చెప్పిన మాటలనే నేను చెప్పాను. అంతే కానీ నేను స్వతహాగా చెప్పిన మాటలు కాదు అంటూ పేర్కొన్నారు. శిర్సత్ వ్యాఖ్యల పై ప్రియాంక తీవ్రంగా స్పందించారు. శిర్సత్ అనే వ్యక్తి తన ఆత్మను అమ్ముకున్న ద్రోహి అంటూ విరుచుకుపడ్డారు. మహిళలపై తనకున్న పాడుబుద్ధిని శిర్సత్ బయటపెట్టేసుకున్నారని అన్నారు. శిర్సత్ వ్యాఖ్యలు గురించి ఆదిత్య కూడా స్పందించారు. ఇలాంటి కుళ్లిన మనస్తత్వం కలిగిన వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా, కాంగ్రెస్‌ను వీడిన ప్రియాంక 2019లో ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన పార్టీలో చేరారు. #maharashtra #uddav-takrey #aditya-takrey #priyanka-chaturvedhi #sanjay-sirsath మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి