Tirupati: రుయా ఆస్పత్రిలో పారిశుధ్ధ్య కార్మికురాలిపై దాడి.. తారాస్థాయికి చేరిన యూనియన్ల గొడవ తిరుపతి రుయా ఆసుపత్రిలో యూనియన్ల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా విధులకు వచ్చిన పారిశుధ్ధ్య కార్మికురాలిపై దాడి కలకలం రేపింది. ఒకవర్గానికి చెందిన వారినే లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో రోగులు, సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు. By Jyoshna Sappogula 21 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Tirupati: తిరుపతి రుయా ఆసుపత్రిలో యూనియన్ల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకవర్గానికి చెందిన వారినే లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో ఆస్పత్రిలోని రోగులు, సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా రుయా ఆస్పత్రిలో విధులకు వచ్చిన పారిశుధ్ధ్య కార్మికురాలిపై దాడి కలకలం రేపింది. ఏఐటీయూసీ, సీఐటీయూ కార్మిక సంఘాల మధ్య వివాదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. Also Read: మేడారం జాతర నిర్వహణ నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం సీఐటీయూ నాయకులను కాంట్రాక్టు సంస్ధ యాజమాన్యం ప్రోత్సహిస్తూ ఏఐటీయూసీ వారిపై దాడులకు ఉసిగోలుపుతోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా విధులకు వచ్చిన కార్మకురాలిపై సీఐటీయూ వర్గానికి చెందిన వారు దాడి చేశారు. బ్లేడ్ తో దాడి చేయగా ఆమె తీవ్రంగా గాయపడింది. సహచరులు ఆమెను అత్యవసర విభాగంలో చేర్పించారు. కాంట్రాక్టు సంస్ధ యాజమాన్యమే తమపై దాడికి సీఐటీయూ వర్గానికి చెందిన వారిని ఉసిగోలుపు తున్నాదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. Also Read: బాబాయ్ పవన్ కళ్యాణ్ కోరితే కచ్చితంగా ప్రచారానికైనా వస్తాను: హీరో వరుణ్ తేజ్ తమకు జీతం తక్కువగా ఇవ్వడంతో పాటు విధులకు ఆటంకం కల్పిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని ఏఐటీయూసీ వర్గానికి చెందిన వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఒంటరిగా ఉన్న సమయంలో వారు మూకుమ్మడిగా దాడులు చేస్తున్నట్లు వెల్లడించారు. రుయా అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. #andhra-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి