/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/rat.jpg)
Sangareddy: సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ కాలేజీ హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని నిరసనకు చేపట్టారు. హాస్టల్‌లో ఉన్న క్యాంటీన్‌లో చట్నీ ఉంచిన పాత్రపై మూత పెట్టకపోవడంతో అందులో ఎలుక పడింది. చట్నీలో ఎలుక ఈదుతుండటాన్ని గమనించిన విద్యార్థులు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
Also Read: ఏపీలో కిడ్నీ రాకెట్ కలకలం.. 30 లక్షలు ఇస్తామని నమ్మించి…
క్యాంటిన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనపై కాలేజీ ప్రిన్సిపల్ నరసింహ స్పందించారు. చట్నీలో ఎలుక పడలేదని.. శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో ఎలుక కనించిందని తెలిపారు. కొందరు విద్యార్థులు కావాలనే వీడియో తీసి ప్రజాప్రతినిధులకు పంపించారని ఆరోపించారు.