Sand Mafia: మూడు ట్రిప్పులు.. ఆరు కాసులు.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఇసుక మాఫియా!

అడ్డూఅదుపు లేకుండా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా ముగ్గురు ప్రాణాల్ని బలిగొన్నాయి. కరీంనగర్ జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మరణించారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద రాంగ్ రూట్‌లో వస్తున్న ఇసుక ట్రాక్టర్‌ బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో స్పాట్‌లో శివరాత్రి అంజి (26),శివరాత్రి సంపత్ (18), గుడిపెల్లి అరవింద్ (22) చనిపోయారు.

New Update
Sand Mafia: మూడు ట్రిప్పులు.. ఆరు కాసులు.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఇసుక మాఫియా!

ప్రాణాలు తోడేస్తున్నారు..ఇసుక అక్రమ రవాణా కారణంగా చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చేసేది నేరం కావడంతో..చట్టం కళ్లుకప్పి తప్పించుకోవాలన్న ఆలోచనతో ట్రాక్టర్‌ని అడ్డదిడ్డంగా..అడ్డగోలుగా నడపడం.. అడ్డొచ్చిన వారిని ఢీకొట్టి చంపడం తెలంగాణలోని చాలా జిల్లాల్లో సర్వసాధారణమైపోయినట్టుగా కనిపిస్తోంది. అడ్డూఅదుపు లేకుండా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా మరో ముగ్గురు ప్రాణాల్ని బలిగొంది. కరీంనగర్ జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మరణించారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద రాంగ్ రూట్‌లో వస్తున్న ఇసుక ట్రాక్టర్‌ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురు స్పాట్‌లోనే చనిపోయారు. మృతులను శివరాత్రి అంజి (26),శివరాత్రి సంపత్ (18), గుడిపెల్లి అరవింద్ (22)గా గుర్తించారు.

గతంలో అనేక ఘటనలు:
నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం తుమ్మడం గ్రామంలో గత జూన్‌లో ఇసుక అక్రమా రవాణా ఆకుల రాములు(66)అనే వృద్ధుడి ప్రాణాల్ని తీసింది. అర్ధరాత్రి దాటాక మూడు గంటల సమయంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఓ నాలుగు ట్రాక్టర్లు నారమ్మగూడెం గ్రామంలో ఇసుక పోసేందుకు మితిమీరిన వేగంతో వెళ్తుండగా.. ఓ ఇసుక ట్రాక్టర్‌ అతివేగంగా వెళ్తూ నిద్రిస్తున్న రాములు మీదకు దూసుకెళ్లడంతో చనిపోయాడు. గతేడాది చివరిలో, ఈ ఏడాది ఆరంభంలోనూ ఇదే తరహా ఘటనలు జరిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట శివారులో బైక్‌ను ఇసుక లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. గతంలో అశ్వాపురం మండలం చింతిర్యాల వద్ద ఎద్దులబండిని అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో ఇద్దరు రైతులు చనిపోయారు. చింతకాని, ముదిగొండ, బోనకల్లు, మధిర తదితర మండలాల్లో అనధికార రీచ్‌ల నుంచి జోరుగా ఇసుక రవాణా సాగుతోంది. నిత్యం గ్రామాల మధ్య నుంచే తరలిస్తున్నారు. అందుకే రహదారులు ఛిద్రమవుతున్నాయి, రాత్రిపూట వీధుల్లోకి రావాలంటేనే భయపడాల్సి వస్తోంది.

publive-image ఇసుక అక్రమా రవాణా (file)

అక్రమ ఇసుక రవాణా ఆగేదెట్లా..?
ఇసుకను అక్రమంగా తరలించేందుకు మాఫియా ఇష్టారాజ్యంగా నడుస్తుంది. ప్రజల ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎక్కడపడితే అక్కడ పెద్దపెద్ద గుంతలు తవ్వుతున్నారు. ఆ గుంతల్లో పడి మరణిస్తున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. చాలా మంది ఇసుక అక్రమ రవాణాకు పాత ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. ఒక్కొక్క ట్రాక్టర్‌కు నెంబర్‌ కూడా లేకపోవడం మరింత విడ్డూరం. దీనికి తోడు ట్రాక్టర్లను నడిపే వారికి కూడా డ్రైవింగ్‌ లైసెన్స్‌ గాని ట్రాక్టర్‌కు ఇన్సురెన్సూలు గాని ఉండడంలేదు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అడపాదడపా చర్యలు తీసుకుంటున్నా ఎక్కడా రవాణా మాత్రం ఆగడం లేదు. మరికొన్ని చోట్ల రెవెన్యూ, పోలీసు యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరించడం, ఇంకొన్ని చోట్ల అక్రమార్కులతో యంత్రాంగం కలిసిపోవడంతో ఇసుకను అక్రమంగా తోడేస్తున్నారు. ఇసుక మాఫియా జోరు తగ్గాలంటే అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమ ఇసుకపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు