Rents: బాబోయ్‌..ఇదేక్కడి అన్యాయం.. 6నెలల్లో ఇంత రెంట్‌ పెంచుతారా..?

బెంగళూరులో అద్దె ధరలు అడ్డగోలుగా పెంచుతున్నారన్న విమర్శలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మారతహళ్లిలో నివసించే గోయల్‌ అతని స్నేహితులు ఫ్లాట్‌లో దిగి ఆరు నెలలు కూడా గడవకముందే రూ.15,000 పెంచారు. ఇదే విషయాన్ని అతను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది.

New Update
Rents: బాబోయ్‌..ఇదేక్కడి అన్యాయం.. 6నెలల్లో ఇంత రెంట్‌ పెంచుతారా..?

బెంగళూరు అర్బన్‌లో అద్దెకు ఇల్లు దొరకడం ఎంత కష్టమో ఆర్సీబీ కప్‌ గెలవడం కూడా అంతే కష్టమంటారు ఐపీఎల్‌ అభిమానులు. ఇది సరదాగే సెటైరే అనుకున్నా.. ఇందులో చాలా నిజముంది. అక్కడ రెంట్‌కి ఇల్లు దొరకలంటే తల ప్రాణం తోకకొచ్చినట్టే..! ఇల్లు దొరకడం వరకు ఒకటైతే.. దొరికిన తర్వాత కట్టే అడ్వాన్స్‌తో మన ఆస్తులు కరిగిపోతాయా అన్న అనుమానం కలుగుతుంది..ఆ తర్వాత కూడా రెంట్ ఎప్పుడు పెంచుతారో తెలియదు.. రెంటల్‌ అగ్రిమెంట్ పేరిట అందినకాడికి దొచుకునే ఓనర్లు అక్కడ వేలల్లో ఉంటారన్నది చాలా మంది అభిప్రాయం. తాజాగా ఓ శాంసంగ్ ఉద్యోగి పెట్టిన పోస్ట్ చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది.


ఇది మరీ దారుణం భయ్యా:
బెంగళూరులో ఉద్యోగం సంపాదించడం కంటే అద్దెకు ఫ్లాట్ పొందడం కష్టం. శాంసంగ్‌లో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా పని చేస్తోన్న 23ఏళ్ల గోయల్‌ ట్విట్టర్‌లో చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఏడాదికి 5శాతం రెంట్ పెంచుతామని ఓనర్‌ తమతో ముందుగా అగ్రీమెంట్‌ చేయించుకున్నాడని.. కానీ ఆరు నెలలు కూడా ముగియకముందే రూ.15,000 పెంచాడని ట్వీట్ చేశారు. పెంచిన అద్దె ధరను కట్టగలిగితే కట్టాలని.. లేకపోతే ఫ్లాట్ వెకేట్ చేయాలని ఓనర్‌ చెప్పిన్నట్టు గోయల్‌ పోస్ట్ చేశాడు. 42వేలకు ట్రిపుల్ బ్యాడ్‌రూమ్‌ ఫ్లాట్‌ తమకు రెంట్‌కి ఇచ్చారని.. ఇప్పుడు ఏడాది కూడా గడవకముందే నెలకు 57వేలు కట్టామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు గోయల్‌. మారతహళ్లి సమీపంలోని దొడ్డనెకుండిలోని గేటెడ్ కమ్యూనిటీలో గోయల్‌తో పాటు అతని ఇద్దరు స్నేహితులు నివసిస్తున్నారు.

ఇల్లు దొరక్క ఇబ్బందులు:
బెంగళూరు రూరల్‌, అర్బన్‌లోని చాలా చోట్లా అద్దెకు ఇల్లు దొరికే అవకాశాలున్నా.. చాలా మంది మాత్రం కొన్ని ప్రాంతాల్లోనే ఇల్లు అద్దెకు తీసుకోవాలని చూస్తుంటారు. ఆఫీస్‌కి దగ్గరగా ఉండేందుకు ఇలా చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. తక్కువ అద్దెకి వేరే ఏరియాలో తీసుకుంటే తర్వాత పెట్రోల్‌ ఖర్చులు అమాంతం పెరిగిపోతాయన్న భయంతో వర్క్‌ ప్లేస్‌కి దగ్గరలోనే ఫ్లాట్స్‌ చూసుకుంటారు. ముఖ్యంగా బ్యాచిలర్స్‌లో ఇలా ఆలోచించేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి బెంగళూరులో జాబ్‌ చేస్తుంటారు. అందులో సొంత వాహనాలు లేని వాళ్లు కూడా ఉంటారు. వీళ్లంతా ట్రాఫిక్‌లో గంటలకు గంటలు ప్రయాణించి ఆఫీస్‌కి రావాల్సి ఉంటుంది. అందుకే రెంట్ ఎక్కువైనా ఆఫీస్‌కి దగ్గరలోనే ఫ్లాట్‌ తీసుకుంటారు. అయితే ఇది ఏమాత్రం ఈజీ కాదు.. దీని కోసం రోజులకు రోజులు తిరగాలి..నెలలకు నెలలు సమయాన్ని కేటాయించాలి.. అప్పుడు కూడా ఇల్లు దొరుకుతుందని గ్యారెంటీ ఉండదు.

దొరికిన తర్వాత మరో తలనొప్పి:
ఒంటరిగా తిరిగి తిరిగి ఏ ఇల్లు, ఫ్లాటు దొరక్క.. చివరి ఆప్షన్‌గా హోం బ్రోకర్స్‌ని సంప్రదించాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ల సాయంతో ఆఫీస్‌కి నియర్‌గానే ఫ్లాట్‌ దొరుకుతుంది. అడ్వాన్స్‌ 6-12నెలల వరకు ఇవ్వమనే ఓనర్లు ఉంటారు. డబ్బులు ఉంటే పర్లేదు కానీ..లేకపోతే ఏ అప్పో సప్పో చేయాల్సి వస్తోంది. తర్వాత ఇంట్లో ఫర్నిచర్‌కి సంబంధించి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇదంతా ఓ మహాయజ్ఞంలా కొనసాగుతుంది. ఫ్లాట్‌లో దిగిన తర్వాత ఏ పగలో చూసుకోని ఓనర్‌ వస్తాడు.. అద్దె పెంచుతున్నామంటూ బాంబు పేలుస్తాడు. అదేంటి మొన్నే కదా వచ్చింది.. అప్పుడే రెంట్ పెంచడమేంటని అడిగితే.. సోసైటీ రూల్స్‌ అని.. గేటెడ్‌ కమ్యూనిటీ రూల్స్‌ అని ఏదో ఒకటి చెబుతారు. కట్టలేకపోతే వేరే ఇల్లు చూసుకోవాలంటారు. మళ్లీ వేరే ఇల్లు అన్న ఆలోచన రాగానే గతమంతా కళ్లముందు తిరుగుతుంది..మళ్లీ ఆ కష్టం రాకూడదని .. పెంచిన అద్దెని కట్టేందుకు అంగీకరించి అక్కడే ఉండిపోతారు టెనెంట్స్‌. గోయల్‌ కూడా అదే చేయాల్సి వచ్చింది.. అందుకే అదే చేశాడు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు