అదిరే ఫీచర్లు.. లాంచ్‌కు కౌంట్‌డౌన్‌.. ఈ మొబైల్‌పై ఓ లుక్కేయండి!

శామ్​సంగ్ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ. నుంచి గెలాక్సీ ఎస్​24 సిరీస్​ మరికొద్ది గంటల్లో రిలీజ్ కానుంది. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఈరోజు రాత్రి భారత కాలమానం ప్రకారం 11:30 గంటలకు అమెరికాలోని శాన్ జోస్ నగరంలో జరుగుతుంది.

అదిరే ఫీచర్లు.. లాంచ్‌కు కౌంట్‌డౌన్‌.. ఈ మొబైల్‌పై ఓ లుక్కేయండి!
New Update

Samsung Galaxy Unpacked 2024: మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్ చెబుతోంది దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శామ్​సంగ్ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ. ఈ సంస్థ నుంచి గెలాక్సీ ఎస్​24 సిరీస్​ మరికొద్ది గంటల్లో రిలీజ్ కానుంది. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఈరోజు రాత్రి భారత కాలమానం ప్రకారం 11:30 గంటలకు అమెరికాలోని శాన్ జోస్ నగరంలో జరుగుతుంది. అదే సమయంలో ఈ ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి శామ్​సంగ్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

మూడు వేరియంట్‌లతో గెలాక్సీ ఎస్​24 సిరీస్
ఈసారి కూడా Galaxy S24 సిరీస్‌లో మూడు వేరియంట్‌లు ఉంటాయి – Galaxy S24, Galaxy S24+ మరియు Galaxy S24 Ultra. ఒకవైపు Samsung దృష్టి ఈసారి Galaxy AI అసిస్టెంట్‌పై ఉండగా, మరోవైపు రాబోయే సిరీస్‌కు సంబంధించిన క ఇతర సమాచారం కూడా లీక్ అయింది. ఈసారి Galaxy S24 సిరీస్ కొన్ని నయా కలర్స్ లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. Galaxy S24 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో డిజైన్ పరంగా పెద్ద మార్పులు ఉండవని కొన్ని లీకైన చిత్రాలను బట్టి తెలుస్తోంది.

S 24 Ultraలో iPhone 15 Pro వంటి టైటానియం ఫ్రేమ్‌
.ప్రతి ఏటా శామ్​సంగ్ కంపెనీ S సిరీస్‌ని ఫిబ్రవరిలో విడుదల చేస్తుంది.కానీ ఈ సారి మాత్రం ముందుగానే రిలీజ్ చేస్తూ మొబైల్ ప్రియులకు ట్రీట్ ఇస్తోంది. అయితే.. తాజా నివేదిక ప్రకారం శామ్‌సంగ్‌ సంస్థ Samsung Galaxy S 24 Ultraలో iPhone 15 Pro వంటి టైటానియం ఫ్రేమ్‌ను అందించబోతోందని సమాచారం .

అదిరిపోయే ఫీచర్స్ తో మరికొద్ది గంటల్లో
ఈ గెలాక్సీ ఎస్24 సిరీస్లో స్టాండర్డ్, ప్లస్, అల్ట్రా వేరియంట్లు ఉంటాయని తెలుస్తోంది.  కెమెరా విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫొటోగ్రఫీ కెమెరా సిస్టమ్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఫోటోగ్రఫీ కోసం Galaxy S24 Ultra 200MP ప్రైమరీ కెమెరా + 12MP అల్ట్రావైడ్, 10MP టెలిఫోటో కెమెరా ఉంటుందని సమాచారం . సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం కంపెనీ మూడు ఫోన్‌లలో 12MP ఫ్రంట్ కెమెరాతో పాటు అదిరిపోయే ఫీచర్స్ తో మరికొద్ది గంటల్లో రిలీజ్ కానుంది.ఈ సిరీస్ డిస్ ప్లే విషయానికి వస్తే .. 6.2 అంగుళాల AMOLED డిస్‌ప్లేను, S24 ప్లస్‌లో 6.7 అంగుళాలు, S24 అల్ట్రాలో 6.8 అంగుళాల డిస్‌ప్లేను అందించగలదని తెలుస్తోంది. . ఇది WQHD+ రిజల్యూషన్ డిస్‌ప్లే ఉంటుందని నివేదికలు చెప్తున్నాయి.ఫీచర్స్ విషయంలో కానీ, కలర్స్ విషయంలో కానీ , ధర ఎంత అనేదానిపై జనాల్లో ఉన్న ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది.

#samsung-galaxy-s-24-ultra #samsung-galaxy-unpacked-2024 #samsung-galaxy-s-24 #galaxy-s24
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి