New Mobile: గేమింగ్ కిర్రాక్..శాంసంగ్ నుంచి అదిరే ఫోన్‌ లాంచ్‌.. ఓ లుక్కేయాల్సిందే..!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ శాంసంగ్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్‌ని రీలాంచ్‌ చేసింది. గెలాక్సీ ఎస్21 FE స్మార్ట్‌ఫోన్‌ను కొత్త చిప్‌సెట్‌తో అప్‌డేట్ చేసింది. రూ. 49,999 ప్రైజ్‌ ట్యాగ్‌తో, స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌సెట్‌తో కూడిన గెలాక్సీ S21 FE నేరుగా కొత్తగా రిలీజైన OPPO రెనో 10 సిరీస్‌తో పోటీపడుతుంది .

New Update
New Mobile: గేమింగ్ కిర్రాక్..శాంసంగ్ నుంచి అదిరే ఫోన్‌ లాంచ్‌.. ఓ లుక్కేయాల్సిందే..!

మొబైల్స్‌ సేల్‌లో శాంసంగ్‌ దూసుకుపోతోంది. దేశంలో గత సంవత్సరం గెలాక్సీ ఎస్21 FE స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్‌ చేయగా..తాజాగా అదే మొబైల్‌ని కొత్త చిప్‌సెట్‌తో అప్‌డేట్ చేసింది . కొత్త గెలాక్సీ ఎస్21 FE మోడల్‌లో రెండేళ్ల నాటి స్నాప్‌డ్రాగన్ 888 5G ప్రాసెసర్ ఉంది. దేశంలో దీని ధర రూ.49,999 . 8GB RAM, 256GB స్టోరేజ్‌తో ఒకే ఒక వేరియంట్ అందుబాటులో ఉంది .నేవీ, ఆలివ్, గ్రాఫైట్, లావెండర్, వైట్ ఈ ఐదు కలర్స్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ శాంసంగ్‌ షాప్‌ ఆన్‌లైన్ స్టోర్‌లో కూడా అందుబాటులో ఉంది. మీరు హెచ్‌డీఎఫ్‌సీ ఈఏంఐ(HDFC EMI) లేదా క్రెడిట్ కార్డ్‌తో రూ.5,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు .

publive-image గెలాక్సీ ఎస్21 FE

స్పెసిఫికేషన్లు:
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డైనమిక్ అమోఎల్ఈడీ 2ఎక్స్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120HZ, టచ్ శాంప్లింగ్ రేట్ 240HZగా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4,500 ఎంఏహెచ్‌గా ఉంది. 25W సూపర్ ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్, 15W వైర్‌లెస్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. రివర్స్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. ఎక్సినోస్ 2100 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్‌ను అందించారు. 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఇందులో ఉన్నాయి.

డిస్‌ప్లే: 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్‌తో 6.4-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 888 5G చిప్‌సెట్
మెమరీ వేరియంట్: 8GB RAMతో 256GB స్టోరేజ్‌
కెమెరాలు: 12MP ప్రధాన కెమెరా + 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ + 8MP టెలిఫోటో సెటప్, 32MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీ.
సాఫ్ట్‌వేర్ : One UI 5.1తో Android 13కి అప్‌గ్రేడ్ చేయవచ్చు

ఫోన్ కేవలం USB-C కేబుల్ ఇన్-బాక్స్‌తో వస్తుంది.. ఛార్జింగ్ అడాప్టర్ లేదు . రూ. 49,999 ప్రైజ్‌ ట్యాగ్‌తో, స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌సెట్‌తో కూడిన గెలాక్సీ S21 FE నేరుగా కొత్తగా రిలీజైన OPPO రెనో 10 సిరీస్‌తో పోటీపడుతుంది . దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం గెలాక్సీ S23 FE మోడల్‌ను ఈ ఏడాది చివర్లో వివిధ అప్‌గ్రేడ్‌లతో విడుదల చేయనుంది . మరోవైపు ఈ మొబైల్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి.

Samsung Galaxy S23 Fe:
అటు శాంసంగ్‌ మరో కొత్త ఫోన్‌తో మార్కెట్‌లోకి రాబోతున్నట్టు తెలుస్తోంది. గ్యాలక్సీ S23 పేరుతో లాంచ్ చేయనుందని సమాచారం. గతంలో వచ్చిన S సిరీస్‌ల కంటే ఇది మరింత అడ్వాన్స్‌ ఫీచర్లతో రానున్నట్టు టాక్‌. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన చీప్ సెట్ అప్ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. ఇంతకుముందు ఉన్న స్మార్ట్ ఫోన్ల కంటే ఈ మొబైల్ డిజైన్ 100 రేట్లు బాగుండడంతో కస్టమర్లు దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు