Khammam: పొంగులేటి, తుమ్మల తోపులా.. సంభాని సంచలన వ్యాఖ్యలు..

కాంగ్రెస్ నేతలు పొంగులేటి శ్రీనివాస్, తుమ్మల నాగేశ్వరరావుపై ఫైర్ అయ్యారు సంభాని చంద్రశేఖర్. వీరిద్దరేమైనా తోపులా అని అన్నారు. సత్తుపల్లిలో సర్పంచ్‌గా కూడా గెలవలేని వ్యక్తి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని విమర్శించారు సంభాని.

Khammam: పొంగులేటి, తుమ్మల తోపులా.. సంభాని సంచలన వ్యాఖ్యలు..
New Update

Sambani Chandrashekar: కాంగ్రెస్‌ నేతలపై బీఆర్ఎస్ నేత సంబాని చంద్రశేఖర్ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్‌లో చేసేవన్నీ బోగస్ సర్వేలే అని వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన సంబాని.. ఖమ్మం కాంగ్రెస్ నేతలైన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తనను మెడలు పట్టి బయటకు గెంటేశారని ఆరోపించారు. సత్తుపల్లిలో సర్పంచ్‌గా కూడా గెలవలేని వ్యక్తికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని అన్నారు. తన సత్తా ఏంటో ముందు ముందు చూపిస్తానని అన్నారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఏం సర్వే చేసి టికెట్ ఇచ్చారని ప్రశ్నించారు సంబాని. వారిద్దరేమైనా తోపులా? అని నిలదీశారు. అగ్రకులం కాదని, డబ్బులు లేవనే తనను కాంగ్రెస్ గౌరవించలేదన్నారు. గతంలో ఉన్న కాంగ్రెస్ వేరు, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ వేరు అని వ్యాఖ్యానించారు సంబాని. కాంగ్రెస్ పార్టీలో కులతత్వం, డబ్బు కీలకమైపోయాయని అన్నారు. కాంగ్రెస్ అవమానిస్తే.. బీఆర్ఎస్ తనను అక్కున చేర్చుకుందని, బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం తన శాయశక్తులా పని చేస్తానని సంబాని చంద్రశేఖర్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా, మాజీ మంత్రి అయిన సంబాని చంద్రశేఖర్ ఈ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. అయితే, కాంగ్రెస్ ఆయనకు టికెట్ నిరాకరించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సంబాని చంద్రశేఖర్.. కాంగ్రెస్‌ పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్​లో పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విద్యార్థి ఉద్యమ నాయకుడు, పీసీసీ జనరల్ సెక్రటరీ కోటూరి మానవతారాయ్, పీసీసీ జనరల్​ సెక్రటరీ, కొత్తగూడెం కాంగ్రెస్​ఇన్ చార్జ్ ఎడవెల్లి కృష్ణ, మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య దంపతులు, డాక్టర్​రామచంద్ర నాయక్​ తదితరులు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఆర్టీవీతో సంబాని చంద్రశేఖర్ ప్రత్యేక ఇంటర్వ్యూని కింది వీడియోలో చూడొచ్చు..

Also Read:

మంత్రి కేటీఆర్‌కు రూ. లక్ష చెక్కు అందజేసిన శంకరమ్మ..

తెలంగాణ ఎన్నికల బరిలో యంగ్ లీడర్స్ వీరే..

#sambani-chandra-shekar #telangana-elections-2023 #khammam-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe