Samantha: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే యాక్ట్రెస్ సమంత (Samantha) ఫాన్స్‌తో అప్పుడప్పుడూ సరదాగా చిట్‌చాట్ చేస్తుంటుందన్న విషయం తెలిసిందే కదా. అభిమానులతో టచ్‌లో ఉంటూ వాళ్లడిగే ప్రశ్నలకు జవాబులిస్తూ ఉంటుంది. అయితే, మళ్లీ పెళ్లి చేసుకునే అంశమై ఓ అభిమాని ఆమెను ప్రశ్నించారు.
‘మళ్లీ పెళ్లిపై మీరెందుకు ఆలోచించకూడదు?’... ఇదీ ఆ అభిమాని సమంతను అడిగిన ప్రశ్న. దీంతో తను ఓ పెద్ద చిట్టానే బయటకు తీసింది. విడాకుల లెక్కలు చూపిస్తూ కాసేపు లెక్కల టీచర్‌లా మారింది. ‘కీ డివోర్స్ స్టాటిస్టిక్స్’ పేరిట సమంత షేర్ చేసిన ఇమేజ్‌లో పేర్కొన్న విడాకుల వివరాల ప్రకారం.. 2023లో నమోదైన విడాకుల్లో మొదటి పెళ్లి విడాకులు 50 శాతం ఉన్నాయి. రెండో పెళ్లి విడాకులు 67 శాతం, మూడోసారి పెళ్లికి సంబంధించిన విడాకులు 73 శాతం ఉన్నాయి. ఇవన్నీ చూపిస్తూ మళ్లీ పెళ్లి బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అంటూ ఓ స్మైల్ ఎమోజీ కూడా ఇచ్చింది ఈ బ్యూటీ.
ఇది కూడా చదవండి: ఈ సారీ జీతం ఎంత పెరుగుతుందో!.. అసలు హైక్ ఇస్తారా!.. ఐటీ ఉద్యోగుల్లో ఇప్పుడిదే చర్చ
మరో అభిమాని ‘మీరు దేవుడిని నమ్ముతారా?’ అని అడిగితే, సమంత నమ్ముతానని చెప్పింది. ఈ మధ్యే ‘ఖుషి’తో అలరించిన సమంత అతిత్వరలోనే ‘సిటాడెల్’ (ఇండియన్ వెర్షన్) వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను అలరించబోతోంది. మరోవైపు, ‘ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్’ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించినట్లు సమంత సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.