/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/salaar-1-jpg.webp)
Disclaimer : We don't encourage piracy. We request all the viewers to watch the movie in theatres
Salaar Movie Leak: సలార్ నిర్మాతలకు బిగ్ షాక్ తగిలింది. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం సలార్ పైరసీ బారిన పడింది. ప్రపంచ వ్యాప్తంగా సలార్ మూవీ నిన్ననే థియేటర్లలో విడుదల అయిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 21 అర్ధరాత్రి నుంచి స్పెషల్ షోస్ వేశారు. సలార్ మూవీపై అంతటా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. విడుదలైన మొదటి రోజునే భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సలార్ రానున్న రోజుల్లో రికార్డ్స్ ను బద్దలు కొట్టడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే, ఇంతలోనే సలార్ టీమ్ కు బిగ్ షాక్ తగిలింది. ఆన్ లైన్ లో సలార్ మూవీ ఫుల్ క్లారిటీతో వచ్చేసింది. మూవీ రూల్జ్, ఫిల్మీ హబ్ లో సలార్ మూవీ పైరసీ అవ్వడంతో నిర్మాతలు షాక్ అవుతున్నారు.
అయితే, ముందుగానే హోంబలే ఫిల్మ్ మేకర్స్ ప్రభాస్ అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. సలార్ కు సంబంధించి ఎక్కడైనా పైరసీ కనిపిస్తే ,..వెంటనే తమ యాంటీ పైరసీ టీంకు తెలియజేయాలని చెప్పారు. అలాగే, ట్విట్టర్ లో ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన సీన్స్ ను..ఎవరైనా పోస్ట్ చేసినా సరే, తమకు తెలుపాలని రిక్వెస్ట్ చేశారు.
Watch #SalaarCeaseFire in cinemas near you. Don't encourage piracy.
Please report pirated links to @blockxtechs & [email protected]#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur… pic.twitter.com/t8DswbQ643
— Hombale Films (@hombalefilms) December 21, 2023
కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో తెరెకెక్కిన పాన్ ఇండియా ఫిలిమ్ ‘సలార్’. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రభాస్ భారీ అంచనాలతో ఎదురు చూస్తూ వచ్చారు. సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ అభిమానులలో సినిమా మరింత అంచనాలను పెంచేసింది. భారీ ఊహాగానాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి ఫస్ట్ డే నుంచే సూపట్ హిట్ టాక్ మొదలైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఓవర్ సీస్ లో కూడా సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
Also read: రాంగోపాల్ వర్మకు బిగ్ షాక్.. వ్యూహం సినిమాకు చెక్ పెట్టిన కోర్టు..
సలార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 345 కోట్ల బిజినెస్ చేసింది. సినిమా బ్రేక్ ఈవెన్ రీచ్ అవ్వడానికి 347 కోట్ల షేర్, 650 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రైట్స్ 145 కోట్లకు పైగా అమ్ముడైనట్లు తెలుస్తోంది. నైజం ఏరియాలో ఈ సినిమా రైట్స్ కోసం మైత్రి మూవీ మేకర్స్ 66 కోట్ల డీల్ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ 160 కోట్లు ఖర్చు చేసి సొంతం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
Disclaimer : We don't encourage piracy. We request all the viewers to watch the movie in theatres