Sakshi Malik: ఇక కుస్తీ పట్టను.. సాక్షి మాలిక్ ఎమోషనల్ రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తాను రెజ్లింగ్ ను వదిలేస్తున్నట్టు ఎంతో బాధతో చెప్పారు. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష ఎన్నికల్లో బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ కు సన్నిహితుడైన సంజయ్ సింగ్ విజయంతో ఆమె కలత చెంది ఈ నిర్ణయానికి వచ్చారు. By Naren Kumar 21 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Sakshi Malikh: రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తాను రెజ్లింగ్ ను వదిలేస్తున్నట్టు ఎంతో బాధతో చెప్పారు. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష ఎన్నికల్లో బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ కు సన్నిహితుడైన సంజయ్ సింగ్ విజయంతో ఆమె కలత చెంది ఈ నిర్ణయానికి వచ్చారు. #WATCH | Delhi: Wrestler Sakshi Malik breaks down as she says "...If Brij Bhushan Singh's business partner and a close aide is elected as the president of WFI, I quit wrestling..." pic.twitter.com/26jEqgMYSd — ANI (@ANI) December 21, 2023 మహిళా రెజ్లర్లతో అసభ్యంగా ప్రవర్తించి, లైంగికంగా వేధించినట్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తామంతా 40 రోజుల పాటు రోడ్డెక్కి ధర్నా చేస్తే దేశమంతా తమకు తోడుగా నిలిచిందని, అయినా, అధ్యక్ష ఎన్నికల్లో తమ అభ్యర్థి ఓడిపోవడం బాధ కలిగించిందని చెప్తూ సాక్షి భావోద్వేగానికి లోనయ్యారు. బ్రిజ్ భూషణ్ వ్యాపార భాగస్వామి గెలిచారంటూ సాక్షి మాలిక్ కంట నీరు పెడుతూ మీడియా సమావేశం నుంచి వెళ్లిపోయారు. #WATCH | Delhi: On former WFI chief Brij Bhushan Sharan Singh's aide Sanjay Singh elected as the new president of the WFI, Wrestler Vinesh Phogat says, "There are minimal expectations but we hope that we get justice. It's saddening that the future of wrestling is in the dark. To… pic.twitter.com/Sr8r2Nvuqg — ANI (@ANI) December 21, 2023 కాగా, రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికతో దేశంలో ఆ క్రీడ భవిష్యత్తును అంధకారంలోకి తీసుకెళ్లిందన్నారు వినేశ్ పోగాట్. అయితే సంకల్ప బలాన్నే నమ్ముకున్న తమకు తప్పక న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తంచేశారు. #sakshi-malik #iwf మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి